అక్షరటుడే, హైదరాబాద్: Hyderabad | తెలంగాణ Telangana రాజధాని హైదరాబాద్లో కాల్పుల ఘటన కలకలం సృష్టిస్తోంది. పాతబస్తీ OLD CITY లో గంజాయి గ్యాంగ్ వార్.. ఒకరి దారుణ హత్య జరిగిన మరుసటి రోజే కాల్పులు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. రోజుకో ఘటనతో మహా నగర వాసులు భయాందోళనకు గురవుతున్నారు.
దిల్సుఖ్నగర్ Dilsukhnagar లో మంగళవారం (జులై 15) తెల్లవారు జామున కాల్పులు కలకలం రేపాయి. శాలివాహన నగర్ పార్క్ Shalivahana Nagar Park సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని దుండగులు చందు నాయక్ అనే వ్యక్తిపై కాల్పులు జరిపారు. దీంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు.
పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. హత్యకు సంబంధించి దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Hyderabad | నిన్ననే పాతబస్తీలో హత్య…
పాతబస్తీ Old Basti – చంద్రాయణగుట్ట Chandrayangutta లో సోమవారం ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. గంజాయి, స్టెరాయిడ్స్ అమ్మకాల్లో తేడా రావడంతో గ్యాంగ్ వార్ చోటుచేసుకుంది. ఈ క్రమంలో అజీజ్ అనే యువకుడి హత్యకు గురయ్యాడు. అజీజ్ స్టెరాయిడ్స్ తీసుకుంటుండగా ప్రత్యర్థులు హతమార్చారు. ఆ మరుసటి రోజే మరో హత్య జరగడం నగర వాసులను ఆందోళనకు గురిచేస్తోంది.
నేరాల నియంత్రణకు తెలంగాణ సర్కారు ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా.. క్రైం ఘటనలు ఆగడం లేదు. సీసీ కెమెరాల వ్యవస్థ పటిష్ఠంగానే ఉంది. కమాండ్ కంట్రోల్ రూం నుంచి నిరంతర పర్యవేక్షణ కొనసాగుతోంది. అయినా నేరాలు జరుగుతూనే ఉన్నాయి. అధికారికంగా, ఉన్నతస్థాయిలో ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. క్షేత్రస్థాయికి వచ్చే సరికి పరిస్థితి భిన్నంగా ఉంటోంది. ఈ క్రమంలోనే నేరాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. నేరాల కట్టడికి సైబరాబాద్ Cyberabad పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. చట్టాలపై ప్రజలకు మరింత అవగాహన పెంచాల్సి ఉంది.