అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Cab Services | ప్రయాణికులకు కేంద్ర ప్రభుత్వం(Central Government) షాక్ ఇచ్చింది. ఇప్పటికే ఇష్టానుసారంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఓలా, ఉబర్, ర్యాపిడో సంస్థలపై విమర్శలు ఉన్నాయి. తాజాగా కేంద్రం రద్దీ సమయాల్లో మరింత ఛార్జీలు(Charges) పెంచుకోవడానికి అనుమతులు ఇచ్చింది. దీంతో ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Cab Services | రద్దీ సమయాల్లో..
ఓలా,(Ola) ఉబర్(Uber), ర్యాపిడో(Rapido)వంటి సంస్థలు ఒకే దూరానికి ఇష్టానుసారంగా రేట్లు వసూలు చేస్తున్నాయి. రద్దీ సమయాలు, వర్షం పడినప్పుడు ఎక్కువ ఛార్జీలు(Higher charges) తీసుకుంటున్నాయి. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా కేంద్రం రద్దీ ఉంటే రేట్లు పెంచుకునేలా వెసులుబాటు కల్పించింది.
Cab Services | రేట్ల పెంపు ఇలా..
కేంద్రం తాజా ఆదేశాల ప్రకారం.. నామామాత్రంగా రద్దీ ఉన్న సమయంలో బేస్ ఛార్జీల్లో సగం సర్‌ఛార్జీ కింద పెంచుకోవచ్చు. రద్దీ అధికంగా ఉంటే.. 200 శాతం పెంచుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. గతంలో ఇది 150 శాతంగా ఉండేది. అలాగే మూడు కిలోమీటర్ల లోపు ప్రయాణానికి ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయొద్దని కేంద్రం కండీషన్ పెట్టింది.
Cab Services | రైడ్ క్యాన్సిల్ చేస్తే ఫైన్
యాప్ ద్వారా రైడ్ బుక్ అయిన తర్వాత క్యాన్సిల్ చేస్తే ఫైన్ పడనుంది. ఒక వేళ డ్రైవర్ క్యాన్సిల్ చేస్తే ఛార్జీలో పది శాతం కస్టమర్‌కు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో సగం డ్రైవర్, మిగతా సగం అగ్రిగేటర్ ప్లాట్‌ఫామ్ (ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి సంస్థలు) చెల్లించాలి. అలాగే కారణం లేకుండా రైడ్‌ను క్యాన్సిల్ చేస్తే ప్రయాణికుడు ఇంతే మొత్తం జరిమానా కట్టాలి.
Cab Services | ప్రైవేట్ మోటార్ సైకిళ్లకు అనుమతి
కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ మోటార్ సైకిళ్లను సైతం క్యాబ్ సర్వీసులుగా(Cab Services) వినియోగించడానికి అనుమతి ఇచ్చింది. గతంలో కమర్షియల్ వాహనాలను మాత్రమే క్యాబ్ సర్వీస్ కోసం వినియోగించాలనే నిబంధన ఉంది. దీంతో ఇటీవల కర్ణాటక హైకోర్టు(Karnataka High Court) బైక్ క్యాబ్ సర్వీసులను నిలిపివేసిన విషయం తెలిసిందే. తమ బైక్‌పై ఓలా, ఉబర్, ర్యాపిడో ద్వారా కస్టమర్లను దింపి ఉపాధి పొందుతున్న ఎంతోమంది రోడ్డున పడ్డారు. తాజాగా కేంద్రం ప్రైవేట్ వాహనాలను కూడా ఉపయోగించడానికి అనుమతిచ్చింది. అలాగే ఆటోలు, బైక్ ట్యాక్సీలు, సహా ఇతర వాహనాలకు బేస్ ఛార్జీలను నిర్ణయించే అధికారాన్ని కేంద్రం రాష్ట్రాలకు అప్పగించింది.