అక్షరటుడే, వెబ్‌డెస్క్ : CRPF | భద్రతా బలగాలు security forces చేపట్టిన ఆపరేషన్ కర్రెగుట్టలు operation karreguttalu విజయవంతమైంది. తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని ములుగు mulugu జిల్లా వెంకటాపూర్ శివారులో గల కర్రెగుట్టల్లో భారీగా మావోయిస్టులు ఉన్నారనే సమాచారం మేరకు బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. సీఆర్పీఎఫ్ బలగాలు ఆ గుట్టలను చుట్టుముట్టి అడవులను జల్లెడ పడుతూ లోనికి చొచ్చుకు వెళ్లాయి. ఈ క్రమంలో ఛత్తీస్‌గఢ్ వైపు జరిగిన ఎన్కౌంటర్ encounterలో అనేక మంది మావోయిస్టులు మృతి చెందినట్లు సమాచారం. గుట్టపై మావోయిస్టుల భారీ బంకర్‌ను బలగాలు గుర్తించాయి. సీఆర్పీఎఫ్ పోలీసుల రాకను గమనించిన మావోలు అక్కడి నుంచి ముందుగానే పారిపోయారు.
తొమ్మిది రోజుల పాటు జరిగిన ఆపరేషన్‌లో బలగాలు పైచేయి సాధించాయి. నేరుగా కర్రెగుట్ట ప్రాంతానికి ఐబీ చీఫ్ చేరుకోవడం గమనార్హం. ఆపరేషన్‌ను గురించి భద్రతా బలగాలు ఆయనకు వివరించాయి. కర్రెగుట్టల పైప్రాంతంలో CRPF బేస్ క్యాంప్ base camp ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. త్వరలో బేస్ క్యాంప్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఛత్తీస్‌గఢ్, తెలంగాణ ప్రాంతాలకు అందుబాటులో ఉండే విధంగా ఈ క్యాంప్ ఏర్పాటు చేయాలని సీఆర్పీఎఫ్ భావిస్తోంది.