అక్షరటుడే, వెబ్‌డెస్క్: Turkey | పాకిస్తాన్‌కు మద్దతు ప్రకటించిన ఇస్లామిక్ దేశం టర్కీకి (islamik country turkey) వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే ఆ దేశం నుంచి పండ్ల దిగుమతులను వ్యాపారులు స్వచ్ఛందంగా నిలిపివేయగా, ట్రావెలింగ్ టికెట్ల బుకింగ్‌ను (traveling ticket booking) ఆయా సంస్థలు నిలిపి వేశాయి. తాజాగా విద్యాసంబంధ అంశంలో టర్కీకి షాక్ తగిలింది. ఆ దేశంతో కుదుర్చుకున్న అన్ని ఎంవోయూలను రద్దు చేస్తున్నట్లు జామియా మిలియా ఇస్లామియా (జేఎంఐ) గురువారం ప్రకటించింది.
ఇది ‘జాతీయ భద్రత’ (national security) అని పేర్కొంది. సీమాంతర ఉగ్రవాదాన్ని (cross-border terrorism) ఎగదోస్తున్న పాకిస్తాన్‌కు టర్కీ సహాయం చేయడాన్ని ఖండించిన జేఎంఐ.. భారత్ వెంట నిలువడమే తమ బాధ్యత అని పేర్కొంది. “జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా, న్యూఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా, టర్కియే రిపబ్లిక్ ప్రభుత్వంతో అనుబంధంగా ఉన్న ఏదైనా సంస్థ మధ్య ఏదైనా అవగాహన ఒప్పందం (ఎంవోయూ) తక్షణ ప్రభావంతో తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నిలిపివేయబడింది. జామియా మిలియా ఇస్లామియా దేశంతో దృఢంగా నిలుస్తుంది” అని విశ్వవిద్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.
టర్కీ విషయంలో ఇప్పటికే జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (Jawaharlal Nehru University), మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ విశ్వవిద్యాలయం (MANUU) హైదరాబాద్ ఇప్పటికే టర్కీతో ఉన్న అన్ని అవగాహన ఒప్పందాలను రద్దు చేసుకున్నాయి. తాజాగా జేఎంఐ ఆ జాబితాలోకి చేరింది. “JNU పూర్తిగా భారత పౌరులతో సబ్సిడీ పొందుతోంది. దేశం దెబ్బతింటుంటే, టర్కీ వంటి దేశంతో మనం సంబంధాలను ఎలా కొనసాగించగలం? ఒక విద్యావేత్తగా, పౌరుడిగా, నా భద్రత ప్రమాదంలో ఉంది – ప్రతి భారతీయుడి భద్రత కూడా..” అని JNU VC అన్నారు.