అక్షరటుడే, వెబ్‌డెస్క్: Director Shankar | భారత సినిమా చరిత్రలో టెక్నాలజీకి సరికొత్త నిర్వచనం ఇచ్చిన దర్శకుడు శంకర్. ఒకప్పుడు టెక్నికల్ గార్లాండ్‌లా అభివర్ణించబడిన ఈ దర్శకుడు ఇప్పుడు వరుస డిజాస్టర్లతో విసుగుతెప్పిస్తున్నాడు.
ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ సినిమాలతో నిరాశ కలిగించిన శంకర్ ఇక ఫ్యూచర్‌లో సినిమాలు చేయడని అందరు అనుకున్నారు. ఆయన పని అయిపోయిందని అన్నారు. ఈ క్రమంలో శంకర్(Director Shankar) తనని విమర్శించేవాళ్లకి తగిన సమాధానం ఇచ్చేందుకు ఓ క్రేజీ ప్రాజెక్ట్ సెట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అదే అతని కలల ప్రాజెక్ట్.. వెల్పారి(Velpari Movie).
Director Shankar | భారీ ప్రాజెక్ట్..
తమిళ రచయిత వెంకటేశన్ రచించిన చారిత్రాత్మక నవల ‘వెల్పారి’ ఆధారంగా, శంకర్ తన డ్రీమ్ ప్రాజెక్ట్‌ను తెరకెక్కించనున్నాడు. ఇది మూడు భాగాల భారీ సిరీస్‌గా రూపొందనుండగా, మొత్తం బడ్జెట్ రూ. 1000 కోట్లు అని ప్రచారం.
గతంలో “రోబో” గురించి గొప్పగా చెప్పిన శంకర్ ఇప్పుడు “వెల్పారి” విషయంలోనూ అదే స్థాయి ఆసక్తిని చూపిస్తున్నాడు. అవతార్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ వంటి ప్రాజెక్టులను రిఫరెన్స్‌గా తీసుకుని, అదే స్థాయి విజువల్ ఎఫెక్ట్స్, సెట్స్, నేరేషన్‌తో రూపొందించబోతున్న ఈ ప్రాజెక్ట్‌లో భారతీయ సినిమాకు నూతన ప్రమాణాలు పరిచయం చేయాలనే పట్టుదలతో ఉన్నారు శంకర్. పాటల ప్రెజెంటేషన్ (Presentation), మేకింగ్, విజువల్స్ (Visuals) అన్నీ అత్యున్నతంగా ఉంటాయని టాక్.
ఈ ప్రాజెక్ట్ కోసం శంకర్ భారీ స్టార్ క్యాస్టింగ్ ప్లాన్ చేస్తున్నాడు. ఇప్పటికే కన్నడ రాక్‌స్టార్ యష్‌తో చర్చలు జరిపినట్టు సమాచారం. అంతేకాదు, కరణ్ జోహార్, నెట్‌ఫ్లిక్స్, పెన్ స్టూడియోస్ వంటి భారీ సంస్థలు ఈ ప్రాజెక్ట్‌లో భాగస్వామ్యం కావచ్చని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.
గేమ్ ఛేంజర్ చిత్ర షూటింగ్ సమయంలోనే ఈ ప్రాజెక్ట్ గురించి హింట్ ఇచ్చాడు శంకర్. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుంది, ఎప్పుడు విడుదల అవుతుంది. ఎలాంటి విజయం సాధిస్తుంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
అయితే శంకర్‌కు త్రీ ఇడియట్స్ తమిళ రీమేక్ అయిన నాన్బన్ నుండి డిజాస్టర్స్ క్యూ కట్టాయి. ఈ సినిమా తర్వాత చేసిన ఐ, 2.0, ఇండియన్ 2, గేమ్ ఛేంజర్.. సినిమాలూ భారీ అంచనాల మధ్య విడుదలై, కలెక్షన్ల పరంగా పూర్తిగా నిరాశపరిచాయి. పాత స్క్రీన్‌ప్లే, అప్‌డేట్ కాని ఎమోషనల్ కంటెంట్‌తో విమర్శలు వెల్లువెత్తాయి.
ఇక శంకర్ ఇండియన్ 3 కూడా చేస్తాడనే ఓ టాక్ నడిచింది. అయితే నేరుగా ఓటీటీలో విడుదల కావచ్చొనే ప్రచారం నడిచింది. గత వైఫల్యాల కారణంగా నిర్మాతలు కూడా శంకర్‌తో సినిమా చేసేందుకు వెనక్కి తగ్గుతున్నారన్న వాదనలు ఉన్నా, వెల్పారి ప్రాజెక్ట్(Velpari Project)తో మాత్రం సరికొత్త ట్రెండ్ చేయాలనే కసితో ఉన్నాడు శంకర్.