అక్షరటుడే, వెబ్‌డెస్క్: Inspectors Transfers | రాష్ట్రంలో పలువురు సీఐలు బదిలీ అయ్యారు. ఈ మేరకు ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మల్టీ జోన్–1 పరిధిలో మొత్తం తొమ్మిది మందిని ట్రాన్స్ఫర్(Transfers) చేస్తూ ఐజీ ఉత్తర్వులు ఇచ్చారు.
Inspector Transfers | తొమ్మిది మంది ట్రాన్స్ఫర్
మెదక్ సీసీఎస్‌లో పనిచేస్తున్న ఇన్స్పెక్టర్ డి.రాజా రెడ్డిని ఎల్లారెడ్డి సీఐ(Yella Reddy CI)గా బదిలీ చేశారు. ఎల్లారెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉన్న బి.రవీంద్ర నాయక్‌ను ఐజీపీ ఆఫీస్(Ravindra Naik IGP Office)కు అటాచ్ చేశారు. అలాగే వెయిటింగ్లో ఉన్న వై.సంజీవరావును వరంగల్ కమిషనరేట్‌కు అటాచ్ చేశారు. బెల్లంపల్లి ఒకటో టౌన్ సీఐగా పనిచేస్తున్న నీలాల దేవయ్య(Nilala Devaiah)ను రామగుండంలోని తాండురు సీఐగా పంపించారు. తాండూరు సీఐ కన్నం కుమారస్వామిని ఐజీపీ కార్యాలయానికి అటాచ్ చేశారు. అలాగే మధిర సీఐ దొంగరి మధు(Madhira CI Dongari Madhu)ను ఇటీవల ఖమ్మం కమిషనరేట్‌కు అటాచ్ చేయగా. తిరిగి మధిరకు పంపించారు. అలాగే కాగజ్‌నగర్ రూరల్ సీఐ కుచన శ్రీనివాస్ రావు(Kuchana Srinivas Rao)ను బెల్లంపల్లి–1 టౌన్ సీఐగా నియమించారు. ఖమ్మం సీఎస్బీ ఇన్స్పెక్టర్ చందవోలు హనూక్(Chandavol Hanukkah)ను బెల్లంపల్లి రూరల్ సీఐగా బదిలీ చేశారు. బెల్లంపల్లి రూరల్ సీఐ అఫ్జలొద్దీన్(Bellampalli Rural CI Afzaluddin)ను ఐజీపీ ఆఫీస్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.
కాగా.. రాష్ట్రంలో పోలీసుల బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. ఇటీవల డీఎస్పీలను బదిలీ చేయగా, గత మూడునాలుగు రోజుల క్రితం మల్టీజోన్–2 పరిధిలో సీఐలను బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ఇటీవల భారీ సంఖ్యలో సబ్ ఇన్స్పెక్టర్లను సైతం ట్రాన్స్ఫర్ చేసిన విషయం తెలిసిందే.