అక్షరటుడే, వెబ్‌డెస్క్: Lahore | పాకిస్తాన్(Pakistan)లోని లాహోర్ లో వరుస పేలుళ్లు సంభవించాయి. స్థానిక వాల్టన్ విమానాశ్రయం(Walton Airport) సమీపంలోని గోపాల్ నగర్, నసీరాబాద్ ప్రాంతాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎయిర్ పోర్టు వద్ద గురువారం ఉదయం ఒక్కసారిగా సైరన్లు మోగాయి. దీంతో పాక్(Pakistan) ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
డ్రోన్ కారణంగానే పేలుడు చోటుచేసుకున్నట్లు పాక్ పోలీసులు(Pakistan Police) చెబుతున్నారు. 5-6 అడుగుల పొడవున్న డ్రోన్ పేలినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. డ్రోన్ ను జామ్ చేయడం ద్వారా కూల్చివేసినట్లు పేర్కొన్నారు. దీంతో పాకిస్తాన్లోని కరాచీ, ఇస్లామాబాద్ సహా పలు విమానాశ్రయాలను(Airports) అధికారులు మూసేశారు.
భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సింధూర్'(Operation Sindoor) మరుసటి రోజే పేలుళ్లు జరగడం గమనార్హం. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. కాగా పేలుళ్లకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా(Social Media)లో చక్కర్లు కొడుతున్నాయి.