అక్షరటుడే, వెబ్‌డెస్క్: stock market | దేశీయ స్టాక్ మార్కెట్(Domestic stock markets)లో ర్యాలీ కొనసాగుతోంది. ప్రధాన సూచీలు వరుసగా ఏడో రోజూ పాజిటివ్‌గా ముగిశాయి. బుధవారం ఉదయం 547 పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్(Sensex).. మొదట ఒడిదుడుకులకులోనై ఇంట్రాడే(Intraday) గరిష్టాలనుంచి 636 పాయింట్లు పడిపోయింది. ఉదయం 11 గంటల తర్వాత కొనుగోళ్ల మద్దతు లభించడంతో తిరిగి లాభాలబాట పట్టింది.
నిఫ్టీ 190 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా.. అమ్మకాల ఒత్తిడి(Selling pressure)తో ఇంట్రాడేలో గరిష్టంగా 250 పాయింట్లకుపైగా నష్టపోయింది. ఆ తర్వాత కోలుకుంది. ట్రేడింగ్(Trading) ముగిసే సమయానికి సెన్సెక్స్ sensex 520 పాయింట్ల లాభంతో 80,116 వద్ద, నిఫ్టీ 161 పాయింట్ల లాభంతో 24,328 వద్ద స్థిరపడ్డాయి.
చైనా(China)తో టారిఫ్ వార్ విషయంలో ట్రంప్ trump కాస్త వెనక్కి తగ్గుతున్నట్లు కనిపించడం, ఫెడ్ చైర్మన్ విషయంలోనూ మొండిపట్టును వీడడంతో మార్కెట్లు markets సానుకూలంగా స్పందించాయి. షాంఘై(Shanghai) మినహా అన్ని ప్రధాన స్టాక్ మార్కెట్లు stock markets లాభాలబాటలో పయనించాయి. అమెరికా(America)తో ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం చివరి దశలో ఉందన్న సంకేతాలతో మన మార్కెట్లు కూడా పరుగులు తీశాయి. అయితే ఇటీవలి కాలంలో జోరుమీదున్న బ్యాంకింగ్(Banking) స్టాక్స్‌లో బుధవారం ప్రాఫిట్ బుకింగ్ profit booking కనిపించింది. అయినా ఐటీ(IT), ఆటో, ఫార్మా రంగాల షేర్లు రాణించడంతో ప్రధాన సూచీలు లాభాల్లో ముగిశాయి.
బీఎస్‌ఈలో BSE నమోదైన కంపెనీలలో 2,078 లాభాలతో, 1,873 నష్టాలతో ముగియగా.. 155 కంపెనీలు ఫ్లాట్‌గా ఉన్నాయి.
81 కంపెనీలు 52 వారాల గరిష్టాలకు చేరగా.. 25 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద ట్రేడ్ trade అయ్యాయి. 7 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 5 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి.
stock market | రాణించిన ఐటీ, ఆటో, ఫార్మా రంగాలు..
బీఎస్‌ఈ(BSE) మిడ్ క్యాప్ ఒక శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ అర శాతానికిపైగా పెరిగాయి. ఐటీ ఇండెక్స్(IT index) నాలుగు శాతం వరకు లాభపడింది. ఆటో ఇండెక్స్ 2.5 శాతం పెరగ్గా.. రియాలిటీ, ఫార్మా(Pharma), పవర్, మెటల్ రంగాల షేర్లూ రాణించాయి. బ్యాంకెక్స్, కన్జ్యూమర్ డ్యూరెబుల్ ఇండెక్స్‌లు ఒక శాతం వరకు నష్టపోయాయి.
Top Gainers
బీఎస్‌ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 24 కంపెనీలు లాభాలతో ముగియగా ఆరు కంపెనీలు మాత్రం నష్టాలతో ముగిశాయి. ప్రధానంగా హెచ్‌సీఎల్ టెక్(HCL tech) 7.72 శాతం పెరిగింది. టెక్ మహీంద్రా tech mahindra, టాటా మోటార్స్ tata motors నాలుగు శాతానికిపైగా పెరగ్గా.. ఇన్ఫోసిస్(Infosys), ఎంఅండ్‌ఎం మూడు శాతానికిపైగా లాభపడ్డాయి. టీసీఎస్, సన్‌ఫార్మా, టాటా స్టీల్ రెండు శాతానికిపైగా పెరిగాయి.
Top Losers
కొటక్ బ్యాంక్(Kotak bank) 2.07 శాతం పడిపోయింది. హెచ్‌డీఎఫ్‌సీ 1.98 శాతం, ఎస్‌బీఐ 1.11 శాతం నష్టపోయాయి.