ACB | ఏసీబీకి చిక్కిన సీనియర్​ అసిస్టెంట్​
ACB | ఏసీబీకి చిక్కిన సీనియర్​ అసిస్టెంట్​

అక్షరటుడే, ఆర్మూర్​: ACB | నిజామాబాద్​ జిల్లాలో Nizamabad district ఓ ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకుంటూ ఏసీబీకి acb trap nizamabad చిక్కారు. ఆర్మూర్​లోని పంచాయతీ రాజ్​ శాఖలో ఎగ్జిక్యూటివ్​ ఇంజినీర్​ విభాగంలో సీనియర్​ అసిస్టెంట్​గా పనిచేస్తున్న శ్రీనివాస శర్మను ఏసీబీ acb cases today అధికారులు సోమవారం రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు.

నందిపేట్​కు చెందిన ఓ గుత్తేదారు నుంచి ఈయన రూ.7 వేలు లంచం డిమాండ్​ చేశాడు. కాగా, లంచం ఇవ్వడం ఇష్టంలేని గుత్తేదారు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. పక్కా పథకం ప్రకారం సోమవారం ఏసీబీ అధికారులు సీనియర్​ అసిస్టెంట్​ శ్రీనివాస్​ శర్మ లంచం డబ్బులు తీసుకుంటుండగా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని అరెస్ట్​ చేశారు. కాగా అతడి ఇంట్లోనూ సోదాలు చేపట్టినట్లు సమాచారం. ఏసీబీ దాడి ఘటనతో మిగితా ప్రభుత్వ వర్గాల్లో గుబులు మొదలైంది.