అక్షరటుడే, కోటగిరి: sand tractors : పోతంగల్ మండలం(Pothangal mandal) కోడిచెర్ల చెక్పోస్ట్(Kodicherla check post) నుంచి ఆదివారం సాయంత్రం ఇసుకను అక్రమంగా తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకున్నట్టు తహశీల్దార్(Tehsildar) గంగాధర్ తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను పట్టుకొని పోలీసుల(Police)కు అప్పగించినట్లు పేర్కొన్నారు. ఇసుక అక్రమ రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
