అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market | యూఎస్ ట్రేడ్ డీల్స్, రెసిప్రోకల్ టారిఫ్స్(Tariffs)తో అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చిత పరిస్థితులు, Q1 సీజన్ ప్రారంభమవడంతో మార్కెట్లలో ఒత్తిడి కొనసాగుతోంది. గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యత ఇస్తుండడంతో సూచీలు నేలచూపులు చూస్తున్నాయి. దీంతో ప్రధాన సూచీలు వరుసగా రెండోరోజూ నష్టాలనే చవిచూశాయి.
గురువారం ఉదయం సెన్సెక్స్(Sensex) 122 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 84 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి క్రమంగా 608 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ 35 పాయింట్ల లాభంతో ప్రారంభమై మరో 13 పాయింట్లు మాత్రమే పెరిగింది. అక్కడినుంచి 184 పాయింట్లు నష్టపోయింది. చివరికి సెన్సెక్స్ 345 పాయింట్ల నష్టంతో 83,190 వద్ద, నిఫ్టీ(Nifty) 120 పాయింట్ల నష్టంతో 25,355 వద్ద స్థిరపడ్డాయి. నిఫ్టీ 50 సూచీలో ఇండస్ ఇండ్, మారుతి(Maruti), టాటా స్టీల్ ఒక శాతానికిపైగా పెరగ్గా.. ఎయిర్‌టెల్, ఆసియా పెయింట్, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్ వంటి కంపెనీలు రెండు శాతానికిపైగా నష్టపోయాయి.
బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 1,959 కంపెనీలు లాభపడగా 2,064 స్టాక్స్ నష్టపోయాయి. 138 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 146 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 49 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 3 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 6 కంపెనీలు లోయర్ సర్క్యూట్‌ను తాకాయి. ఈరోజు టీసీఎస్(TCS) క్యూ1 ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఐటీ సూచీలు బలహీనంగా ట్రేడ్ అయ్యాయి.
Stock Market | టెలికాం, పీఎస్‌యూ బ్యాంక్, ఐటీ రంగాలలో సెల్లాఫ్
పీఎస్‌యూ బ్యాంక్, టెలికాం(Telecom), ఐటీ సెక్టార్ల స్టాక్స్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. బీఎస్‌ఈలో రియాలిటీ ఇండెక్స్(Realty index) 0.69 శాతం, మెటల్ 0.40 శాతం లాభాలతో ముగిశాయి. టెలికాం ఇండెక్స్ 1.11 శాతం పతనమవగా.. పీఎస్‌యూ బ్యాంక్ 0.86 శాతం, ఐటీ ఇండెక్స్ 0.77 శాతం, హెల్త్‌కేర్ 0.50 శాతం, ఎఫ్‌ఎంసీజీ 0.47 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్ 0.44 శాతం, క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 0.43 శాతం నష్టపోయాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.12 శాతం పెరగ్గా.. లార్జ్ క్యాప్(Large cap) ఇండెక్స్ 0.39 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.28 శాతం నష్టాలతో ముగిశాయి.
Stock Market | Top gainers..
బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 6 కంపెనీలు లాభాలతో 24 కంపెనీలు నష్టాలతో ఉన్నాయి. మారుతి 1.36 శాతం, టాటా స్టీల్ 1.04 శాతం, బజాజ్ ఫైనాన్స్ 0.72శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 0.65 శాతం, ట్రెంట్ 0.41 శాతం లాభపడ్డాయి.
Stock Market | Top losers..
ఎయిర్‌టెల్ 2.62 శాతం, ఆసియాపెయింట్ 1.92 శాతం, ఇన్ఫోసిస్ 1.05 శాతం, బీఈఎల్ 1.03 శాతం, టెక్ మహీంద్రా 0.93 శాతం నష్టపోయాయి.