అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్(Domestic stock market)లో ప్రారంభ లాభాలు ఆవిరయ్యాయి. ప్రధాన సూచీలు వరుసగా రెండో రోజూ నష్టాల్లోనే ముగిశాయి. గురువారం ఉదయం సెన్సెక్స్(Sensex) 131 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 52 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్ 83,186 నుంచి 83,850 రేంజ్‌లో, నిఫ్టీ(Nifty) 25,384 నుంచి 25,587 రేంజ్‌లో కదలాడాయి. చివరికి సెన్సెక్స్ 170 పాయింట్ల నష్టంతో 83,239 వద్ద, నిఫ్టీ 48 పాయింట్ల నష్టంతో 25,405 వద్ద స్థిరపడ్డాయి.
ముడి చమురు ధరలు పెరుగుతుండడం, భారత్‌ను ఆర్థికంగా దెబ్బతీయడానికి చైనా ఎత్తులు వేస్తుండడం, ఎఫ్‌ఐఐల అమ్మకాలు, వాణిజ్య ఒప్పందం విషయంలో యూఎస్(US) ఎలా వ్యవహరిస్తుందోనన్న భయాలతో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో బెంచ్ మార్క్ ఇండెక్స్‌లు ఒత్తిడికి గురయ్యాయి. రోజంతా లాభనష్టాల మధ్య ఊగిసలాడి చివరికి నష్టాలతో ముగిశాయి.
బీఎస్‌ఈ(BSE)లో నమోదైన కంపెనీలలో 2,009 కంపెనీలు లాభపడగా 2,001 స్టాక్స్ నష్టపోయాయి. 158 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 148 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 54 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి. 8 కంపెనీలు అప్పర్ సర్క్యూట్‌ను, 10 కంపెనీలు లోయర్ సర్క్యూట్(Lower circuit)ను తాకాయి. బీఎస్‌ఈలో నమోదైన కంపెనీల విలువ రూ. 1.58 లక్షల కోట్లు తగ్గింది.
Stock Market | పీఎస్‌యూ బ్యాంక్స్‌లో సెల్లాఫ్
పీఎస్‌యూ బ్యాంక్ స్టాక్స్(PSU bank stocks)లో అమ్మకాల ఒత్తిడి కొనసాగుతోంది. గురువారం బీఎస్‌ఈలో పీఎస్‌యూ బ్యాంక్ సూచీ 0.91 శాతం పతనమైంది. మెటల్ ఇండెక్స్ 0.77 శాతం, రియాలిటీ ఇండెక్స్ 0.61 శాతం, టెలికాం 0.55 శాతం, ఇన్‌ఫ్రా 0.49 శాతం, బ్యాంకెక్స్ 0.48 శాతం నష్టపోయాయి. హెల్త్‌కేర్(Health care) ఇండెక్స్ 0.74 శాతం పెరగ్గా.. ఆయిల్ అండ్ గ్యాస్ 0.45 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 0.43 శాతం, ఆటో ఇండెక్స్ 0.40 శాతం, ఎఫ్‌ఎంసీజీ సూచీ 0.18 శాతం లాభాలతో ముగిశాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.47 శాతం లాభపడగా.. లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.25 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.06 శాతం నష్టాలతో ముగిశాయి.
Stock Market | Top gainers..
బీఎస్‌ఈలో 11 కంపెనీలు లాభాలతో 19 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. మారుతి 0.98 శాతం, ఇన్ఫోసిస్ 0.48 శాతం, ఎన్టీపీసీ 0.45 శాతం, హెచ్‌యూఎల్ 0.36 శాతం, ఎటర్నల్ 0.35 శాతం లాభపడ్డాయి.
Stock Market | Top losers..
కొటక్ బ్యాంక్ 1.91 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 1.38 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.30 శాతం, అదాని పోర్ట్స్ 0.80శాతం, టైటాన్ 0.76 శాతం నష్టపోయాయి.