అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Mutual Fund | దీర్ఘకాలికంగా మంచి రాబడుల కోసం మ్యూచ్‌వల్ ఫండ్స్ Mutual Funds లో పెట్టుబడులు పెట్టాలని ఆర్థిక నిపుణులు చెబుతుంటారు. ఆయా ఫండ్ మేనేజర్ల Fund managers పనితీరు, రిస్క్ risk అసెస్మెంట్తో పాటు ఆ ఫండ్ పోర్ట్‌ఫోలియోను చెక్ చేసుకొని మ్యూచ్‌వల్ ఫండ్లను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మ్యూచ్‌వల్ ఫండ్ పెట్టుబడులు స్టాక్ మార్కెట్ stock market రిస్క్‌కు లోబడి ఉంటాయి. కానీ దీర్ఘకాలికంగా చాలా వరకు ఫండ్లు మంచి ఆదాయాన్నే తెచ్చిపెట్టాయి.
ఎస్‌బీఐ SBI తాజాగా కొత్త ఫండ్‌ను ప్రారంభించనుంది. ఎస్‌బీఐ ఇన్‌కమ్ ప్లస్ ఆర్బిట్రేజ్ యాక్టివ్ SBI Income Plus Arbitrage Active ఎఫ్‌ఓఎఫ్ పేరుతో ఒక కొత్త ఫండ్ ఆఫ్ ఫండ్ (FoF) పథకాన్ని ప్రారంభించింది. ఇది డెట్-ఓరియెంటెడ్ పథకాలు, ఆర్బిట్రేజ్ మ్యూచువల్ ఫండ్ పథకాలలో పెట్టుబడి పెడుతుంది. ఈ కొత్త ఫండ్ ఆఫర్ ఏప్రిల్ 23న ప్రారంభమై ఏప్రిల్ 30న ముగుస్తుంది. ఒకేసారి కనీసం రూ.5వేలు ఇన్వెస్ట్ invest చేయొచ్చు. నెలవారిగా ఎస్ఐపీ అయితే రూ.500 నుంచి ప్రారంభించవచ్చు.