More
    HomeజాతీయంSBI | ఖాతాదారులపై ఎస్‌బీఐ ‘అమృత్‌ వృష్టి’.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌పై వడ్డీ ఎంతంటే?

    SBI | ఖాతాదారులపై ఎస్‌బీఐ ‘అమృత్‌ వృష్టి’.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌పై వడ్డీ ఎంతంటే?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: SBI | దేశీయ ప్రభుత్వరంగ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ(SBI) తన ఖాతాదారుల కోసం ప్రత్యేకమైన అమృత్‌ వృష్టి(Amrit vrishti) స్కీమ్‌ను పునరుద్ధరించింది. రిస్క్‌ లేకుండా మంచి రాబడిని ఆశిస్తూ, పరిమిత కాలానికి ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌(Fixed deposit) చేయాలనుకునేవారికి, సీనియర్‌ సిటిజన్లకు ఇది మంచి ఎంపిక అవుతుంది. ఇది ఈనెల 15వ తేదీనుంచే అందుబాటులోకి వచ్చింది. కాగా.. 444 రోజుల కాలపరిమితి గల ఈ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌లో వడ్డీ రేట్లు(Interest rate) మాత్రం కాస్త తగ్గాయి. గతంలో సాధారణ ఖాతాదారుకు 7.25 శాతం వడ్డీ చెల్లించేవారు. ప్రస్తుతం 7.05 శాతం వడ్డీ చెల్లించనున్నారు. 20 బేసిస్‌ పాయింట్ల(Basis points) మేర వడ్డీ రేట్లను తగ్గించినా.. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న ఉత్తమ ఎఫ్‌డీలలో ఇది ఒకటి.

    READ ALSO  SBI Interest Rate | రుణగ్రహీతలకు ఎస్బీఐ గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లు తగ్గిస్తున్నట్లు ప్రకటన

    SBI | సీనియర్‌ సిటిజన్లకు అదనపు లాభం..

    సీనియర్‌ సిటిజన్ల(Senior citizens)కు ఈ స్కీమ్‌లో 0.50 బేసిస్ పాయింట్ల మేర అదనపు వడ్డీ లభించనుంది. అయితే గతంలో ఈ స్కీమ్‌లో 7.75 శాతం వడ్డీని అందించగా.. ప్రస్తుతం దానిని 7.55 శాతానికి తగ్గించారు. సూపర్‌ సీనియర్‌ సిటిజన్ల(80 ఏళ్లు దాటినవారు)కు 7.65 శాతం వడ్డీ చెల్లిస్తున్నారు.

    SBI | ఎఫ్‌డీని బ్రేక్‌ చేస్తే..

    ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ కాలపరిమితి 444 రోజులు. ఒకవేళ డబ్బులు అవసరమై ముందే ఎఫ్‌డీని క్లోజ్‌(Close) చేయాలనుకుంటే బ్యాంకు(Bank) కొంత జరిమానా విధిస్తుంది. రూ. 5 లక్షలలోపు ఎఫ్‌డీని క్లోజ్‌ చేస్తే 0.50 శాతం, అంతకుమించిన ఎఫ్‌డీలపై ఒక శాతం వరకు పెనాల్టీ (Penalty)పడుతుంది. ఎఫ్‌డీపై లోన్‌ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది.

    SBI | ఎలా అప్లయ్​ చేయాలి..

    సమీపంలోని ఎస్‌బీఐ శాఖను సంప్రదిస్తే పూర్తి వివరాలు తెలియజేస్తారు. బ్యాంక్‌ బ్రాంచ్‌(Bank branch)తోపాటు ఎస్‌బీఐ ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, యోనో(YONO) యాప్‌ల ద్వారా కూడా ఎఫ్‌డీ ఖాతా తెరవవచ్చు. రూ. 3 కోట్ల వరకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేయడానికి అవకాశం ఉంది.

    READ ALSO  Air India | త్రుటిలో తప్పిన మరో విమాన ప్రమాదం

    Latest articles

    Khamenei | ఖ‌మేనీని టార్గెట్ చేసిన ఇజ్రాయిల్‌.. చంపొద్ద‌ని వారించిన ట్రంప్‌

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Khamenei : ఇరాన్‌తో యుద్ధం జ‌రుగుతున్న వేళ ఇజ్రాయిల్ భారీ ప్ర‌ణాళిక వేసింది. ఇరాన్ సుప్రీం...

    Caste Census | జ‌న‌, కుల గ‌ణ‌న‌కు స‌న్నాహాలు.. సోమవారం నోటిఫికేష‌న్ విడుద‌ల

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కేంద్ర ప్ర‌భుత్వం (central government) జ‌న గ‌ణ‌న‌(population Census)కు స‌న్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించి సోమ‌వారం...

    Sonia Gandhi | సోనియాగాంధీకి అస్వ‌స్త‌త‌.. ఆస్ప‌త్రిలో చేరిక‌

    అక్షరటుడే, న్యూఢిల్లీ: కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు సోనియాగాంధీ (Senior Congress leader Sonia Gandhi) ఆదివారం అస్వ‌స్త‌త‌కు గుర‌య్యారు....

    CM Revanth | ఆధునిక పరిశ్రమ అవసరాలకు తగినట్లుగా ఐటీఐల సిలబస్‌ అప్‌గ్రేడ్.. ప్రత్యేక కమిటీకు సీఎం ఆదేశం​

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : తెలంగాణలో వీఎఫ్ఎక్స్‌, గేమింగ్‌, ఆడియో విజువల్స్ రంగాలకు సంబంధించి సెంటర్ ఆఫ్...

    More like this