అక్షరటుడే, వెబ్‌డెస్క్: PM Modi |భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ PM Modi మంగళవారం సౌదీ అరేబియా Saudi Arabia పర్యటనకు వెళ్లారు. ఈ సందర్భంగా మోదీకి సౌదీ ప్రభుత్వం ఆకాశంలో ఘన స్వాగతం పలికింది. మోదీ ప్రయాణిస్తున్న విమానం సౌదీ అరేబియా గగనతలంలోకి ప్రవేశించగానే.. సౌదీ ఎయిర్‌ఫోర్స్‌కు Saudi Airforce చెందిన ఎఫ్-15 విమానాలు ఆయన విమానాన్ని అనుసరించి అరుదైన స్వాగతం పలికాయి. దీనికి సంబంధించిన వీడియోను విదేశాంగశాఖ సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
సౌదీ అరేబియా యువరాజు మొహమ్మద్ బిన్ సల్మాన్ Mohammed bin Salman ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ జెడ్డాలో ల్యాండ్ అయ్యారు. సౌదీతో పలు కీలక ఒప్పందాలు, చర్చలే లక్ష్యంగా మోదీ రెండు రోజుల పర్యటనకు వెళ్లారు. ఇంధనం, వాణిజ్యం, రక్షణ వంటి పలు కీలక రంగాల్లో సహకారంపై ఇరు దేశాల అధినేతలు చర్చించనున్నారు. దీనిపై ప్రధాని ఎక్స్ వేదికగా స్పందించారు. ఈ పర్యటన రెండు దేశాల మధ్య స్నేహాన్ని మరింత బలోపేతం చేయనుందని ఆయన పేర్కొన్నారు.
