అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Saudi Arabia | గల్ఫ్ దేశమైన సౌదీ అరేబియాను భారీ ఇసుక తుఫాన్ కమ్మేసింది. ఆ దేశ రాజధాని రియాద్‌లో ఆకాశాన్ని తాకేలా ఇసుక తుఫాన్ రేగడంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. సౌదీతో పాటు కువైట్, జోర్డాన్‌లలో కూడా ఇసుక తుఫాన్ బీభత్సం సృష్టించింది. దీంతో మూడు దేశాల్లో అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. తుఫాన్ దాటికి భారీ ఎత్తున లేచిన దుమ్ముతో ప్రజలు అవస్థలు పడ్డారు. వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పలు విమానాలను కూడా అధికారులు రద్దు చేశారు.
Stunning drone footage captures the massive sandstorm sweeping through Al Rass, Saudi Arabia.pic.twitter.com/hmFLhmOw45
— Massimo (@Rainmaker1973) May 5, 2025