అక్షరటుడే, వెబ్‌డెస్క్ : South Central Railway | దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్‌గా సంజయ్ కుమార్ శ్రీవాస్తవ(Sanjay Kumar Srivastava) నియమితులయ్యారు. సంజయ్‌కుమార్‌ను నియమించాలని రైల్వే మంత్రిత్వ శాఖ(Railway Ministry) చేసిన ప్రతిపాదనలను కేబినెట్ నియామకాల కమిటీ ఆమోదించింది. దీంతో ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు.
దక్షిణ మధ్య రైల్వే జోన్ జీఎంగా పని చేసిన అరుణ్ కుమార్ జైన్(Arun Kumar Jain) పది రోజుల క్రితం ఉద్యోగ విరమణ చేశారు. దీంతో దక్షిణ కోస్తా రైల్వే జోన్ జీఎం సందీప్ మధుర్కు అదనపు బాధ్యతలు అప్పగించారు.
తాజాగా సంజయ్ కుమార్ శ్రీవాస్తవను జీఎం నియమించారు. కాగా.. ఆయన ప్రస్తుతం యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో ఉన్న సెంట్రల్ ఆర్గనైజేషన్ ఫర్ రైల్వే ఎలక్ట్రిఫికేషన్ జీఎం(Railway Electrification GM)గా విధులు నిర్వహిస్తున్నారు. ఇండియన్ రైల్వే ఇంజినీరింగ్ సర్వీసు 1988 బ్యాచ్‌కు చెందిన సంజయ్ కుమార్ పలు ప్రాజెక్టుల రూపకల్పనలో కీలకంగా వ్యవహరించారు.