అక్షరటుడే, వెబ్‌డెస్క్: Samsung Galaxy Watch Ultra : ప్రముఖ కంపెనీ సామ్‌సంగ్ తన వాక్ – ఎ – థాన్ ఇండియా Walk-a-Thon India Challenge ఛాలెంజ్‌కు సంబంధించిన రెండో ఎడిషన్‌ను ఆవిష్కరించింది. సామ్‌సంగ్ హెల్త్ samsung health app యాప్‌ను ఉపయోగించే వారి కోసం 30 రోజుల ప్రచారంలో భాగంగా బంపర్ ఆఫర్ best offer ప్రకటించింది. ఈ పోటీలో పాల్గొనాలంటే.. తోటి వినియోగదారులతో పోటీ పడుతూ పరిమిత కాలపరిమితిలో కొన్ని దశలను పూర్తి చేయాల్సి ఉంటుంది. ఈ ఛాలెంజ్‌ను విజయవంతంగా పూర్తి చేస్తే సామ్‌సంగ్ గెలాక్సీ అల్ట్రా వాచ్ ultra watchతో పాటు ప్రత్యేక రివార్డులు అందుకోవచ్చు.
ఏప్రిల్ 21 నుంచి మే 20, 2025 వరకు రోజువారీ స్టెప్ కౌంట్‌ను walking distance step count సామ్‌సంగ్ హెల్త్ యాప్‌ని ఉపయోగించి ట్రాక్ చేయాల్సి ఉంటుంది. ఈ నెల రోజుల్లో 2 లక్షల అడుగులు పూర్తి చేసిన వారందరూ బహుమతులకు అర్హులు. సామ్‌సంగ్ పోటీలో పాల్గొనే వారందరిలో ముగ్గురు అదృష్ట విజేతలకు గెలాక్సీ వాచ్ అల్ట్రా అందుతుంది. 2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ దశలను పూర్తి చేసిన ప్రతి ఒక్కరికీ గెలాక్సీ వాచ్ అల్ట్రాపై 25 శాతం తగ్గింపు ఇస్తారు.
Samsung Galaxy Watch Ultra : పోటీలో పాల్గొనాలంటే..
సామ్‌సంగ్ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ Samsung Galaxy smartphone లో సామ్‌సంగ్ హెల్త్ యాప్‌ను తెరిచి టుగెదర్ విభాగానికి వెళ్లాలి. ఏప్రిల్ 21, 2025న ప్రారంభమమైన వాక్ – ఎ – థాన్ ఇండియా ఛాలెంజ్‌ను ఎంపిక చేసుకోవాలి. అక్కడ పేర్కొన్న నియమాలను పాటిస్తూ 30 రోజుల వ్యవధిలో మొత్తం 2 లక్షల అడుగులు పూర్తి చేయాల్సి ఉంటుంది. లక్కీ డ్రాలో పాల్గొనడానికి #WalkathonIndia హ్యాష్‌ట్యాగ్‌తో సామ్‌సంగ్ సభ్యుల యాప్‌లో పూర్తయిన స్క్రీన్‌షాట్‌ను షేర్ చేయాలి.
Samsung Galaxy Watch Ultra : సామ్‌సంగ్ గెలాక్సీ వాచ్ అల్ట్రా ఫీచర్లు..
గతేడాది సామ్‌సంగ్ గెలాక్సీ వాచ్ అల్ట్రాను తీసుకొచ్చింది. ఇది టైటానియం-గ్రేడ్ ఫ్రేమ్ titanium-grade frameతో ఉంటుంది. 1.5 – అంగుళాల (480×480 పిక్సెల్స్) సూపర్ ఎమోఎల్ఈడీ డిస్‌ప్లేను 3,000 నిట్‌ల గరిష్ట ప్రకాశంతో పొందొచ్చు. గెలాక్సీ వాచ్ 7 మాదిరిగానే ఇది ప్రాసెసర్, స్టోరేజ్, ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. ఈ వాచ్ డబ్ల్యూపీసీ ఆధారిత వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో 590 ఎంఏహెచ్ బ్యాటరీ కలిగి ఉంటుంది.