అక్షరటుడే, వెబ్డెస్క్:Samantha Temple | అందాల ముద్దుగుమ్మ సమంత Samantha కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందన్న విషయం తెలిసిందే. సినిమాల ద్వారానే కాకుండా సేవా కార్యక్రమాల ద్వారా కూడా సమంత విశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్(Fan Following) పెంచుకుంది. సమంత సేవా కార్యక్రమాలకి ఫిదా అయిన ఓ అభిమాని ఏకంగా గుడి కట్టాడు. గుంటూరు జిల్లా చుండూరు మండలం ఆలపాడుకు చెందిన తెనాలి సందీప్ కు హీరోయిన్ సమంత(Heroine Samantha) అంటే చచ్చేంత ఇష్టం. ఆమె నటన మాత్రమే కాదు ఆమె చేసే సేవా కార్యక్రమాలకి ఫిదా అయిన అతను ఆమె పుట్టిన రోజు నాడు వినూత్నంగా గుడి కట్టాలని నిర్ణయించుకున్నాడు. ఇంకేముంది 2023లో ఆమె పుట్టిన రోజు సందర్భంగా తెనాలి(Tenali)లో ఆమె విగ్రహాన్ని తయారు చేయించి విగ్రహావిష్కరణ చేయించారు. అప్పటి నుంచి ఆమె గుడిలో ప్రతి ఏటా ఆమె పుట్టిన రోజు నాడు అన్నదానం కూడా నిర్వహిస్తున్నారు.
Samantha Temple | అలా అనేసింది..
సమంత(Samantha) చిన్న పిల్లలకు చేస్తున్న కార్రక్రమాలతో స్పూర్తి పొందిన సందీప్ ప్రతి ఏటా అదే విధంగా అనాధ బాలబాలికలు అన్నదానం చేస్తున్నారు. ఈ ఏడాది సమంత బర్త్ డే(Samantha Birth Day) సందర్భంగా మరో విగ్రహాన్ని Temple ఆవిష్కరించి అనాథలకి అన్నాదానాలు చేశారు సమాజం కోసం మంచి పనులు చేస్తున్న వారిని గుర్తుపెట్టుకోవాలన్న ఉద్దేశంతోనే తాను గుడి కట్టించినట్లు చెప్పుకొచ్చాడు. అయితే తాజాగా తనకి గుడి కట్టడంపై సమంత కాస్త వెరైటీగా స్పందించింది. ఓ అభిమాని నా కోసం గుడి కట్టారని తెలిసి ఆశ్చర్యపోయాను. నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నారా? అని అనుకున్నా. ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావడం లేదు. అది అతని ప్రేమను చూపించే తీరు అని అనిపించింది. కానీ ఇలా నాకు గుళ్లు కట్టి, నాకు పూజలు చేసే పద్దతిని మాత్రం నేను ఎంకరేజ్(Encourage) చేయలేను అని చెప్పుకొచ్చింది.
ఇక సమంత నిర్మిస్తున్న శుభం మే 9న విడుదల కానుండగా,ఈ మూవీ ప్రమోషన్(Movie Promotion) కార్యక్రమాలలో సమంత యాక్టివ్‌గా పాల్గొంటుంది.. ‘శుభం’ Subhamచిత్రానికి మంచి డేట్ దొరికింది. మే 9 అనేది సమ్మర్ హాలీడేస్(Summer Holidays)లో ఉంటుంది. ఫ్యామిలీ అంతా కలిసి చూసేందుకు వీలుంటుంది. మంచి డేట్ దొరకడం మా అదృష్టం. మా ‘శుభం’ సినిమాని అందరూ చూసి సక్సెస్ చేయండి అని సమంత పేర్కొంది. నాకు నేనే ఓ పెద్ద విమర్శకులురాలిని. ఏ సినిమాలో ఎక్కడ తప్పు చేశానో నాకు తెలుస్తుంది. ఈ చిత్రంలో ఎలాంటి తప్పులు జరగకూడదని ఎడిటింగ్ టేబుల్ వద్ద చాలా కష్టపడ్డాం అని చెప్పింది సమంత.