అక్షరటుడే, వెబ్డెస్క్ :GP Workers | రాష్ట్ర ప్రభుత్వం(State Government) ఎట్టకేలకు పంచాయతీ కార్మికులకు జీతాలు చెల్లించింది. మూడు నెలలుగా వేతనాలు లేకపోవడంతో జీపీ కార్మికులు(GP Workers) తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబ పోషణ భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీతాల కోసం ఇటీవల ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీల్లో పని చేస్తున్న మల్టీ పర్పస్ వర్కర్లకు(Multi Purpose Workers) వేతనాలు విడుదల చేసింది.
రాష్ట్రంలో పని చేసే పంచాయతీ కార్మికులకు గతంలో పంచాయతీ ఖాతాల నుంచి జీతాలు చెల్లించేవారు. దీంతో జీపీలకు వచ్చే నిధులలో నుంచి కార్మికులకు జీతాలు ఇచ్చేవారు. లేదంటే సర్పంచులు సొంతంగా నెలనెలా జీతాలు ఇచ్చి తర్వాత నిధులు విడుదలైనప్పుడు తీసుకునే వారు. అయితే 16 నెలలుగా పల్లెల్లో పాలక వర్గాలు లేవు. అంతేగాకుండా ప్రభుత్వం నేరుగా జీపీ కార్మికుల ఖాతాల్లో వేతనాలు వేస్తోంది. అయితే ప్రతినెలా జీతాలు చెల్లించకపోవడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. తాజాగా కార్మికుల ఇబ్బందులను దృష్టిలో ప్రభుత్వం నిధులు విడుదల చేసింది.
GP Workers | రూ.150 కోట్లు విడుదల
పంచాయతీల్లో పనిచేస్తున్న మల్టీ పర్పస్ కార్మికుల వేతనాల కోసం రూ.150 కోట్లు విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు (Finance Department Orders) జారీ చేసింది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన వేతనాల కోసం ఈ నిధులను కేటాయించింది. ఈ మేరకు నిధులు కార్మికుల ఖాతాల్లో జమ కానున్నాయి. దీంతో కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రతి నెలా తమకు జీతాలు చెల్లించాలని కోరుతున్నారు. మూడు, నాలుగు నెలలకు ఒకసారి జీతాలు ఇస్తే.. మిగతా రోజుల్లో కుటుంబ పోషణ కోసం అప్పులు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Read all the Latest News on Aksharatoday and also follow us in ‘X‘ and ‘Facebook‘