More
    HomeసినిమాDirector sailesh | హిట్ కొట్టిన శైలేష్ .. నాగార్జున ఛాన్స్ ప‌ట్టేసిన‌ట్టేనా?

    Director sailesh | హిట్ కొట్టిన శైలేష్ .. నాగార్జున ఛాన్స్ ప‌ట్టేసిన‌ట్టేనా?

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Director sailesh | టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో క్రేజీ కాంబినేష‌న్స్ సెట్ అవుతున్నాయి. యువ ద‌ర్శ‌కులు చెప్పే పాయింట్స్ స్టార్ హీరోల‌కి న‌చ్చేయడంతో ఏ మాత్రం వెన‌కాడ‌కుండా ఓకే చెప్పేస్తున్నారు. టాలీవుడ్ యువ ద‌ర్శ‌కుడు శైలేష్ కొల‌ను తెర‌కెక్కించిన హిట్ 3 చిత్రం నేడు ప్రేక్ష‌కుల ముందుకు రాగా, ఈ మూవీ హిట్ టాక్ సంపాదించుకుంది. హిట్ ఫ్రాంఛైజీలో ఇప్పటికే రెండు హిట్లు కొట్టిన శైలేష్ కొలను ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఈ చిత్రం కూడా హిట్ కొట్టింది. అయితే శైలేష్‌ ఇప్పటికే నాగార్జునకు ఒక ఐడియా చెప్పడం, ఆయన ఇంప్రెస్ అవడం జరిగిందట. ఐతే ఫైనల్ కాల్ కోసం వెయిట్ చేస్తున్నట్టు ఇండ‌స్ట్రీలో టాక్ వినిపిస్తుంది.

    Director sailesh | నాగ్‌తో దోస్తి..

    హిట్ 3 విజ‌యం సాధించింది కాబ‌ట్టి ఇక నాగ‌- శైలేష్ మూవీ ప‌ట్టాలెక్క‌డానికి ఎన్నో రోజులు ప‌ట్ట‌క‌పోవ‌చ్చు. ప్ర‌స్తుతం నాగ్ ట్రాక్ రికార్డే బాగా లేదు. ఆయన పెద్ద హిట్ కొట్టి చాలా ఏళ్లయిపోయింది. బంగార్రాజు, నా సామి రంగ లాంటి యావరేజ్ చిత్రాలతో సరిపెట్టారు. ‘నా సామి రంగ’ తర్వాత ఆయన సోలో హీరోగా కొత్త సినిమాకు ఓకే చేయలేదు. ఏడాది దాటినా సైలెంట్‌గా ఉంటూ వ‌స్తున్నారు. త‌మిళ ద‌ర్శ‌కులు నవీన్, మోహన్ రాజాలతో చర్చలు జ‌రిపారు. కానీ ఇంత వ‌ర‌కు ఏ సినిమాకి సంబంధించి ప్ర‌క‌ట‌న అయితే చేయ‌లేదు.

    హిట్ ఫ్రాంఛైజీతో శైలేష్ బాగానే టాలెంట్ చూపించాడు కానీ.. వెంకటేష్‌తో తీసిన ‘సైంధవ్’ మాత్రం తేడా కొట్ట‌డంతో త‌న స‌త్తా మ‌ళ్లీ రుజువు చేయాల్సి వ‌చ్చింది. ‘హిట్-3’ పాజిటివ్ టాక్ రావ‌డంతో నాగార్జున‌.. శైలేష్‌తో సినిమా చేయ‌డం ఖాయం అంటున్నారు. ఇటీవ‌ల అక్కినేని ఫ్యామిలీ హీరో నాగ చైత‌న్య తండేల్‌తో భారీ హిట్ కొట్టాడు. ఇప్పుడు నాగార్జున‌, అఖిల్‌లు కూడా మంచి హిట్ కోసం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. మ‌రి ఏ ద‌ర్శ‌కుడు వారికి అలాంటి మంచి హిట్స్ ఇస్తాడో చూడాలి.

    Latest articles

    Alumni Friends | పూర్వ విద్యార్థుల బడిబాట

    అక్షరటుడే, కామారెడ్డి: Alumni Friends | తాము చదువుకున్న బడి కోసం పూర్వ విద్యార్థులు (Alumni Friends) ముందుకొచ్చారు....

    Lemon Juice | నిమ్మ‌రసం.. ఇలా చేస్తేనే ప్ర‌యోజ‌నం

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Lemon Juice | వేసవిలో సాధారణంగా ఎక్కువ‌గా తాగేది నిమ్మ‌రసం (ష‌ర్బాత్‌). దాహం తీర్చ‌డంతో పాటు చ‌ల్ల‌ద‌నం...

    May Day | ఘనంగా మేడే వేడుకలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: May Day | ఉమ్మడిజిల్లాలో మేడేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా కూడళ్లలో ఎర్రజెండాలను...

    Bjp – Congress | కుల గ‌ణ‌న‌పై మైలేజ్ కోసం.. బీజేపీ, కాంగ్రెస్ మ‌ధ్య డైలాగ్ వార్‌..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: BJP-Congress | జ‌న గ‌ణ‌న‌తో పాటు కుల గ‌ణ‌న(Caste Census) నిర్వ‌హించ‌నున్న‌ట్లు కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది....

    More like this

    Alumni Friends | పూర్వ విద్యార్థుల బడిబాట

    అక్షరటుడే, కామారెడ్డి: Alumni Friends | తాము చదువుకున్న బడి కోసం పూర్వ విద్యార్థులు (Alumni Friends) ముందుకొచ్చారు....

    Lemon Juice | నిమ్మ‌రసం.. ఇలా చేస్తేనే ప్ర‌యోజ‌నం

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Lemon Juice | వేసవిలో సాధారణంగా ఎక్కువ‌గా తాగేది నిమ్మ‌రసం (ష‌ర్బాత్‌). దాహం తీర్చ‌డంతో పాటు చ‌ల్ల‌ద‌నం...

    May Day | ఘనంగా మేడే వేడుకలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: May Day | ఉమ్మడిజిల్లాలో మేడేను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా కూడళ్లలో ఎర్రజెండాలను...
    Verified by MonsterInsights