అక్షరటుడే, బాన్సువాడ: RTC tour Package | బాన్సువాడ (Banswada) ఆర్టీసీ డిపో నుంచి వివిధ రకాల టూర్లకు విశేష స్పందన లభిస్తోంది. అధికారుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యాత్ర ప్యాకేజీలను ప్రయాణికులు ఆదరిస్తున్నారు. ప్రైవేట్ వాహనాల్లో యాత్రలకు వెళ్తే రవాణా ఖర్చులు ఎక్కువగా ఉండడం.. భద్రత దృష్ట్యా టూరిస్టులు ఎక్కువగా ఆర్టీసీ ప్యాకేజీలకు ఆకర్షితులవుతున్నారు.
RTC tour Package | బాన్సువాడ నుంచి మహారాష్ట్ర యాత్ర
బాన్సువాడ నుంచి మహారాష్ట్రలోని (Maharashtra) పర్లీ వైద్యనాథ్ (Parli Vaidyanath), అంబాజోగాయ్, పండరిపూర్ విఠలేశ్వర్ మందిరం (Pandharipur Vithaleshwar Temple), షోలాపూర్, తుల్జాపూర్ భవానీ మాత దర్శనం ఈనెల 20న సూపర్ లగ్జరీ బస్సు (super luxury bus) నడుపుతున్నట్లు డీఎం సరితాదేవి తెలిపారు.
ఉదయం 6 గంటలకు బాన్సువాడ నుంచి బయలుదేరుతుందని, మరుసటి రోజు (21న) సాయంత్రం 6 గంటలకు చేరుకుంటుందని అన్నారు. టికెట్ ధర పెద్దలకు రూ. 2,200, పిల్లలకు రూ. 1,100 ఉంటుందని, ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాళ్లని కోరారు. టికెట్స్ కోసం గోపికృష్ణ 9063408477ను సంప్రదించాలని సూచించారు.
RTC tour Package | 19న బిర్లా మందిర్ టూర్..
ఈనెల 19న బాన్సువాడ – బిర్లా మందిరం (Birla Mandir)- సాలార్జింగ్ మ్యూజియం (Salarjing Museum)- ముచ్చింతల్ టూర్(Muchinthal Tour) ప్యాకేజీ ఏర్పాటు చేశారు. బాన్సువాడ (banswada) నుంచి ఉదయం 6 గంటలకు బస్సు బయలుదేరి రాత్రి 12 గంటలకు బాన్సువాడకు చేరుకుంటుందన్నారు.