అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Tirumala Dairy | చెన్నై(Chennai)లోని తిరుమల డెయిరీ మేనేజర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏపీలోకి విశాఖపట్నంకు చెందిన నవీన్ బొల్లినేని(37) చెన్నై మాధవరంలోని తిరుమల డెయిరీ(Tirumala Dairy)లో ట్రెజరీ మేనేజరుగా పని చేస్తున్నాడు. అయితే కంపెనీలో ఇటీవల రూ.40 కోట్ల మోసం జరిగింది. మనీ లాండరింగ్(Money Laundering) జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో విచారణకు హాజరు కావాలని పోలీసులు నవీన్‌కు నోటీసులు అందించారు.
Tirumala Dairy | ఈ మెయిల్ పంపి..
కంపెనీ లెక్కల్లో నవీన్ రూ.40 కోట్లు మోసానికి(Rs. 40 Crore Fraud) పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో తాను డబ్బు తిరిగి ఇస్తానని నవీన్ ఒప్పుకున్నట్లు సమాచారం. అయితే డబ్బులు ఆయన తిరిగి ఇవ్వలేకపోయాడు. ఈ క్రమంలో పోలీసులు నోటీసులు(Police Notice) అందించడంతో నవీన్ పుళల్ బ్రిటానియానగర్‌లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. అంతకు ముందు నవీన్ తన సోదరికి ఈ మెయిల్ పంపాడు. దీంతో కుటుంబ సబ్యులు వచ్చి చూసే సరికే నవీన్ మృతి చెందాడు. తనను కొంతమంది అధికారులు బెదిరిస్తున్నారని ఈ మెయిల్లో ఉన్నట్లు సమాచారం.