అక్షరటుడే, ఆర్మూర్: Miss World competitions | రాష్ట్రానికి ఏమాత్రం ఉపయోగపడని అందాల పోటీల(Miss Worls)కు రూ. కోట్లల్లో నిధులు ఖర్చు చేస్తున్నారని.. అన్నదాతలకు కనీస సౌకర్యాలు కల్పించడం లేదని బీఆర్ఎస్ జిల్లాధ్యక్షుడు జీవన్ రెడ్డి (Ex Mla Jeevan Reddy) మండిపడ్డారు. ఆర్మూర్‌లో (Armoor) మీడియాతో ఆదివారం ఆయన మాట్లాడారు.
రాష్ట్ర ఖజానా ఖాళీ అయ్యిందని ప్రతి సమావేశంలో మాట్లాడే సీఎం రేవంత్‌రెడ్డికి (CM Revanth Reddy) అందాల పోటీలకు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం విక్రయించుకునేందుకు కొనుగోలు కేంద్రాల్లో రైతన్న నానా అవస్థలు పడుతున్నారని.. ప్రభుత్వానికి మాత్రం అందాలపోటీలు కావాల్సి వచ్చిందని దుయ్యబట్టారు.
Miss World competitions| కొనుగోలు కేంద్రాలవైపు కన్నెత్తి చూడట్లేదు..
కొనుగోలు కేంద్రాల్లో (Paddy Centers) గన్నీబ్యాగులు, లారీలు, హమాలీల కొరత వేధిస్తోంటే సంబంధిత అధికారులు ఆవైపు కన్నెత్తి చూడట్లేదని జీవన్‌రెడ్డి (Jeevan Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. పైనుంచి ప్రజాపాలన అంటూ కాంగ్రెస్ లేనిగొప్పలు చెప్పుకుంటుందని ఎద్దేవా చేశారు. రైతుభరోసాకు నిధులు లేవని చెప్పి.. అందాల పోటీలు ఎలా నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు.