Akshara Today: RR vs GT : ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్ 2025) Indian Premier League – IPL 2025)లో రాజస్థాన్ రాయల్స్ Rajasthan Royals తరఫున ఆడుతూ అతిపిన్న వయస్కుడిగా గుర్తింపు పొందిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ vaibhav suryavamshi అరుదైన రికార్డు నమోదు చేశాడు.
గుజరాత్ టైటాన్స్ తో జరుగుతున్న మ్యాచ్లో గుజరాత్ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. మొదట 17 బంతుల్లో 51 పరుగులు చేసి, ఆఫ్ సెంచరీ చేశాడు. వాషింగ్టన్ సుందర్ వేసిన ఐదో ఓవర్లో రెండు సిక్స్ లు, ఓ ఫోర్ కొట్టాడు.
ఆ తర్వాత 35 బంతుల్లో ఏకంగా సెంచరీ కొట్టి రికార్డు నెలకొల్పాడు. కరీం జనత్ వేసిన ఓవర్లో వరుసగా 6 , 4 , 6, 4 , 4 , 6 బాదేశాడు. ఐపీఎల్ చరిత్రలోనే అరుదైన రికార్డు నమోదు చేసుకున్నాడు.