అక్షరటుడే, ఇందల్వాయి: Bheemgal Police | రౌడీషీటర్లు తమ ప్రవర్తన మార్చుకోవాలని భీమ్గల్ ఎస్సై కె.సందీప్ (SI Sandeep) హెచ్చరించారు. గురువారం భీమ్గల్ పోలీస్స్టేషన్లో (Bheemgal Police Station) రౌడీషీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. పంచాయతీ ఎన్నికలు (Panchayat elections) రానున్న దృష్ట్యా కఠిన నిబంధనలు అమలు చేస్తామన్నారు.
రౌడీషీటర్లు ఎక్కడా కూడా తమకు సంబంధం లేని విషయాల్లో తలదూర్చవద్దని హెచ్చరించారు. గొడవల జోలికి వెళ్లవద్దని పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్కు విధిగా హాజరు ఇవ్వాలని చెప్పారు. ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే ప్రయత్నం చేస్తే చట్టప్రకారం కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.