అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Rohit Sharma | టీమిండియా క్రికెటర్ రోహిత్ శర్మ Rohit Sharma సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్ట్ క్రికెట్ test cricket కు వీడ్కోలు retirement పలుకుతున్నట్లు ఇన్స్టాగ్రామ్ వేదికగా రోహిత్ ప్రకటించాడు.
‘‘నేను టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నాను. తెల్ల దుస్తులు ధరించి దేశానికి ప్రాతినిధ్యం వహించడం నాకు దక్కిన గౌరవం. ఏళ్లుగా మీ ప్రేమ, మద్దతకు ధన్యవాదాలు. వన్డే ఫార్మాట్‌లో దేశానికి ప్రాతినిధ్యం వహిస్తూనే ఉంటాను” అని రోహిత్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు.
రోహిత్ శర్మ టీ 20 వరల్డ్ కప్ t 20 world cup గెలిచిన తర్వాత టీ 20 ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. తర్వాత ఆయన టెస్టుల్లో కెప్టెన్‌గా కొనసాగాడు. అయితే బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో రోహిత్ విఫలం అయ్యాడు. ఆయన ఆఖరి టెస్ట్ మ్యాచ్ కూడా బోర్డర్ గావస్కర్ సిరిస్‌లోని నాలుగో టెస్ట్ మ్యాచ్. ఆ సిరిస్‌లో హిట్ మ్యాన్ విఫలం కావడంతో ఆఖరు టెస్టు నుంచి ఆయన తప్పుకున్నాడు. కాగా ఆ సిరీస్‌ను భారత్ 1–3 తేడాతో ఓడిపోయింది. అనంతరం టెస్టులు ఆడని రోహిత్ తాజాగా రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే వన్డేల్లో మాత్రం కొనసాగుతానని రోహిత్ తెలిపాడు.
రోహిత్ శర్మ టెస్టుల్లో 116 ఇన్నింగ్స్‌లలో 40.57 సగటుతో 4,301 పరుగులు చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 18 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అయితే 2024లో జరిగిన టెస్ట్‌ల్లో ఈ హిట్‌మ్యాన్ విఫలం అయ్యాడు. మరోవైపు కెప్టెన్‌గా రోహిత్ 24 టెస్ట్‌లకు నాయకత్వం వహించాడు. ఇందులో 12 మ్యాచుల్లో భారత్ గెలవగా.. తొమ్మిదింట్లో ఓడిపోయింది.