అక్షరటుడే, కోటగిరి: Police : పోతంగల్ మండలంలోని హంగర్గలో దొంగలు బీభత్సం సృష్టించారు. వేసవి కాలం కావడంతో చల్లదనం కోసం దాబాపై కుటుంబ సభ్యులు పడుకుంటే.. కింద ఇంట్లో చొరబడి సొత్తు దోచుకెళ్లారు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. హంగర్గ గ్రామానికి చెందిన పుట్టి రాములు, కుటుంబీకులు వేసవి కాలం కావడంతో సోమవారం రాత్రి దాబాపై నిద్రించారు. తెల్లవారిలేచి చూసేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో ఆందోళన చెందారు. ఇంట్లోకి వెళ్లి చూస్తే.. బీరువా తెరిచి ఉంది.
బీరువాలో దాచిన ఐదు తులాల బంగారం, ఆరు తులాల వెండి, కొంత నగదు మాయమైంది. బయటకొచ్చి చూసేసరికి ద్విచక్ర వాహనం కూడా కనబడలేదు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.