అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | కామారెడ్డి మండలంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్సై రంజిత్ (SI Ranjit) తెలిపిన వివరాల ప్రకారం.. కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి జీపీ (Chinnamalla Reddy GP) పరిధిలోని గురురాఘవేంద్ర కాలనీలో (Gururaghavendra Colony) నివాసముండే ప్రభుత్వ ఉద్యోగి దేవరాజు ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లాడు. తిరిగి సోమవారం ఇంటికి వచ్చి చూడగా ఇళ్లంతా గందరగోళంగా ఉండి బీరువా తెరిచి ఉన్నట్లు గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని విచారణ చేపట్టారు. బీరువాలో 16 తులాల బంగారు నగలు, రూ.60వేలు చోరీకి గురైనట్లుగా గుర్తించినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Kamareddy | వైరల్గా మారిన సీసీ పుటేజీ..
సీసీ పుటేజీలో (CCTV footage) ముగ్గురు దుండగులు ఇంటి వద్ద రెక్కీ నిర్వహించి పక్కాగా చోరీకి పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. కాగా.. గురు రాఘవేంద్ర కాలనీతో పాటు హౌసింగ్ బోర్డ్, జీవీఆర్ కాలనీ తదితర కాలనీలో దొంగలు సంచరిస్తున్న సీసీ పుటేజీ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో పట్టణంలోని పలు కాలనీవాసులు భయాందోళనకు చెందుతున్నారు. వెంటనే ఉన్నతాధికారుల స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.