అక్షరటుడే, కామారెడ్డి : NH 44 : దారి దోపిడీ దొంగలు రెచ్చిపోతున్నారు. అడ్డగోలుగా దోచుకుంటున్నారు. పోలీసులు ఎంత అలర్ట్ గా ఉంటున్నా దొంగలు చోరీలు చేస్తూ పోలీసులకు సవాల్ విసురుతూనే ఉన్నారు.
ముఖ్యంగా దారి దోపిడీ ఘటనలు వాహనదారులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. దారి దోపిడీకి పాల్పడే అంతర్ రాష్ట్ర ముఠా(పార్తీ గ్యాంగ్)(Parthi gang) నెల రోజుల క్రితం పట్టుబడింది.
కామారెడ్డి పోలీసులు వల పన్ని దారి దోపిడీ ముఠాను పట్టుకున్నారు. నిందితులను జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
అయినా, మరోసారి జాతీయ రహదారిపై దారి దోపిడి ఘటన పోలీసులకు police సవాలుగా మారింది. దారి దోపిడీ దొంగలు మరోసారి రెచ్చిపోయారు.
తాజాగా టేక్రియాల్ జాతీయ రహదారిపై మొబైల్స్ లోడ్ తో వెళ్తున్న ఓ ట్రక్కు truck లో నుంచి మొబైల్స్ బాక్సులను ఎత్తుకెళ్లారు.
ఎస్సై రంజిత్ తెలిపిన వివరాల ప్రకారం.. మొబైల్స్ mobile లోడుతో వెళ్తున్న ట్రక్కును డ్రైవరు శుక్రవారం రాత్రి రహదారిపై ఓ దాబా వద్ద నిలిపారు.
National Highway : సుమారు రూ. 10 లక్షల విలువైన..
తెల్లవారుజామున గుర్తుతెలియని దుండగులు ట్రక్కు తలుపులు తెరిచి రెండు మొబైల్ బాక్సులను ఎత్తుకెళ్లారు. వాటి విలువ సుమారుగా రూ.10 లక్షల వరకు ఉంటుందని సమాచారం.
ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. ఘటనాస్థలికి చేరుకుని ఆధారాల కోసం అన్వేషించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.