అక్షరటుడే, హైదరాబాద్: road accident : హయత్‌నగర్(Hayatnagar)లో ఘోర రోడ్డు ప్రమాదం(road accident) చోటుచేసుకుంది. కుంట్లూరులో ఆగి ఉన్న డీసీఎంను ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో వ్యక్తి తీవ్ర గాయపడ్డాడు.
సమాచారం అందుకున్న పోలీసులు(Police) ఘటనాస్థలికి చేరుకున్నారు. చికిత్స నిమిత్తం క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రి(Gandhi Hospital)కి తరలించారు. మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదు.