More
    Homeక్రైంACB Trap | ఏసీబీకి చిక్కిన ఆర్​ఐ, బిల్​ కలెక్టర్​

    ACB Trap | ఏసీబీకి చిక్కిన ఆర్​ఐ, బిల్​ కలెక్టర్​

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Trap | మరో అవినీతి అధికారి ఏసీబీకి చిక్కాడు. నిత్యం ఏసీబీ దాడులు (ACB Raids) జరుగుతున్నా.. అవినీతికి అలవాటు పడిన అధికారులు భయపడకుండా లంచాలు వసూలు చేస్తూనే ఉన్నారు.

    తమ పనుల కోసం కార్యాలయాలకు వచ్చే ప్రజలను లంచాల పేరిట వేధిస్తున్నారు. డబ్బులు ఇస్తేనే పనులు చేస్తున్నారు. లేదంటే కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటున్నారు. అయితే ప్రజల్లో అవగాహన రావడంతో అవినీతి అధికారులపై ఏసీబీకి ఫిర్యాదు చేస్తున్నారు. ఈ క్రమంలో లంచం తీసుకుంటూ ఓ ఆర్​ఐ, బిల్​ కలెక్టర్​ ఏసీబీకి చిక్కారు.

    ACB Trap | ఇంటి నంబర్​ కేటాయించడానికి లంచం..

    కొత్తగా నిర్మించుకున్న ఇంటికి నంబర్ (House Number) కేటాయించడానికి లంచం అడిగిన రెవెన్యూ ఇన్​స్పెక్టర్ (RI)​ను ఏసీబీ అధికారులు శనివారం పట్టుకున్నారు. పెద్దపల్లి (Peddapalli) జిల్లా సుల్తానాబాద్​ పట్టణంలో ఓ వ్యక్తి కొత్తగా ఇల్లు నిర్మించుకున్నాడు. ఆ ఇంటికి నంబర్​ కేటాయించాలని మున్సిపల్​ ఆఫీస్​లోని రెవెన్యూ​ ఇన్​స్పెక్టర్ (Revenue Inspector)​ అనపర్తి వినోద్ కుమార్​ను కలిశాడు. దీని కోసం ఆయన రూ.5 వేల లంచం అడిగాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో శనివారం బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా ఆర్​ఐ వినోద్​కుమార్​తో పాటు, బిల్ కలెక్టర్​ నాంపల్లి విజయ్​కుమార్​ను ఏసీబీ అధికారులు రెడ్​ హ్యాండెడ్​గా పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్​ చేశారు.

    READ ALSO  Gold Seized | ఎయిర్‌పోర్టులో భారీగా బంగారం పట్టివేత

    ACB Trap | ఫిర్యాదు చేయండి

    ప్రభుత్వ అధికారులు లంచం అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని ఏసీబీ అధికారులు కోరుతున్నారు. వారి పనిచేయడానికి డబ్బులు, లేదా ఇతర వస్తువులు అడిగినా భమ పడకుండా తమకు ఫోన్​ చేయాలని సూచిస్తున్నారు. ఏసీబీ టోల్​ ఫ్రీ నంబర్​ (ACB Toll Free Number) 1064, వాట్సాప్ నంబర్​ 9440446106కు ఫోన్​ చేసి సమాచారం అందిస్తే అవినీతి అధికారుల పని పడుతామని చెబుతున్నారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.

    Latest articles

    Turmeric Board | పసుపు రైతులకు పండుగే..

    అక్షరటుడే, ఇందూరు : Turmeric Board | పసుపు రైతుల దశాబ్దాల కళ నెరవేరడమే కాకుండా ఇందూరు కేంద్రంగా...

    Farmers | యూరియా కోసం రైతుల తిప్పలు.. ప్రభుత్వంపై ఎమ్మెల్యే ఆగ్రహం

    అక్షరటుడే, ఆర్మూర్ : Farmers | వానాకాలం సాగు పనులు ప్రారంభం అయ్యాయి. పలు గ్రామాల్లో వరి నాట్లు...

    Dattatreyudu Nori | ప్రభుత్వ సలహాదారుగా వైద్య నిపుణుడు దత్తాత్రేయుడు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dattatreyudu Nori | తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా డాక్టర్ నోరి దత్తాత్రేయుడు (Dattatreyudu Nori...

    Minister Uttam | పాత ప్రాజెక్టుల పునరుద్ధరణ.. కొత్త ప్రాజెక్టులకు ప్రాధాన్యం.. నీటి భద్రతే ప్రభుత్వ ధ్యేయమన్న మంత్రి ఉత్తమ్

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Minister Uttam | నీటి భద్రతే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని రాష్ట్ర నీటి పారుదల శాఖ...

    More like this

    Turmeric Board | పసుపు రైతులకు పండుగే..

    అక్షరటుడే, ఇందూరు : Turmeric Board | పసుపు రైతుల దశాబ్దాల కళ నెరవేరడమే కాకుండా ఇందూరు కేంద్రంగా...

    Farmers | యూరియా కోసం రైతుల తిప్పలు.. ప్రభుత్వంపై ఎమ్మెల్యే ఆగ్రహం

    అక్షరటుడే, ఆర్మూర్ : Farmers | వానాకాలం సాగు పనులు ప్రారంభం అయ్యాయి. పలు గ్రామాల్లో వరి నాట్లు...

    Dattatreyudu Nori | ప్రభుత్వ సలహాదారుగా వైద్య నిపుణుడు దత్తాత్రేయుడు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Dattatreyudu Nori | తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా డాక్టర్ నోరి దత్తాత్రేయుడు (Dattatreyudu Nori...