అక్షరటుడే, వెబ్‌డెస్క్: Madhya Pradesh | మధ్యప్రదేశ్ రాష్ట్రం రేవా జిల్లా(Rewa District)లో హృదయవిదారకమైన ఘటన చోటుచేసుకుంది. భార్యను హత్య చేసిన భర్త, తన నేరాన్ని దాచేందుకు సరికొత్త ప్లాన్ వేసి తొలుత తప్పించుకున్నాడు. పొలంలో భార్య శవాన్ని పూడ్చి, గోప్యత కోసం అదే స్థలంలో కూరగాయల మొక్కలు నాటిన ఈ వ్యక్తి చివరకు పోలీసుల నుంచి తప్పించుకోలేక అరెస్ట్ అయ్యాడు.
ఈ ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రం(Madhya Pradesh State) రేవా జిల్లాలోని సోహగి పోలీస్ స్టేషన్(Sohagi Police Station) పరిధిలో జరిగింది. స్థానికంగా నివాసం ఉండే దేవ్‌ముని మజి అనే వ్యక్తి, కుటుంబసభ్యులతో కలిసి జీవనం సాగించేవాడు. అతనికి భార్య రామ్‌వతి, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. వ్యవసాయ పనులు చేసుకునే దేవ్‌ముని, 2023 అక్టోబర్ 11న తన భార్య రామ్‌వతిని పురుగుల మందు తాగించి హత్య చేశాడు.
Madhya Pradesh | నోట్లో పురుగుల మందు పోసి హత్య
హత్య అనంతరం శవాన్ని తన పొలంలో పూడ్చి, పైభాగంలో కూరగాయల మొక్కలు నాటి ఆ ప్రాంతాన్ని సాధారణంగా కనిపించేలా చేశాడు. అప్పటి నుంచి ఊరిని విడిచి కుమార్తెను తీసుకుని పరారయ్యాడు. హత్య జరిగిన రోజే, దేవ్‌ముని కుమారుడు అభిలాష్ మజి తన తల్లి కనిపించకపోవడంతో సోదరిని అడిగాడు. ఆమె ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లిందని చెప్పింది. కానీ తల్లి రాకపోవడంతో అభిలాష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ (Police Investigation) ప్రారంభించి అనుమానాస్పదంగా భావించిన దేవ్‌మునిని గాలించడం మొదలుపెట్టారు.
పోలీసుల విచారణలో రామ్‌వతి శవం పొలంలోని కూరగాయల తోటలో (Vegetable Form) పూడ్చివేసినట్టు నిర్ధారణ అయింది. స్థానిక అధికారుల సమక్షంలో మృతదేహాన్ని బయటకు తీశారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న దేవ్‌మునిని వెతికే పనిలో ఉన్న పోలీసులు , తాజాగా అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచారు. ఎంత తెలివిగా తప్పించుకునే యత్నం చేసినా, చివరిగా న్యాయం గెలుస్తుందనే విషయాన్ని ఈ ఘటన మరోసారి స్పష్టంచేస్తోంది. భార్యను హత్య చేసి శవం పూడ్చి, పైగా కూరగాయలు నాటి దాన్ని దాచిపెట్టే చర్య ప్రజలలో ఆగ్రహం, భయాన్ని కలిగిస్తోంది.