అక్షరటుడే, వెబ్‌డెస్క్: KTR | సీఎం రేవంత్ రెడ్డిపై cm revanth reddy అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు brs working president ktr ఊరట లభించింది. బంజారాహిల్స్ ఠాణాలో నమోదైన కేసును హైకోర్టు High court కొట్టివేసింది. ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం కేసును కొట్టివేస్తూ తీర్పు వెల్లడించింది.
KTR | ముఖ్యమంత్రి రూ.2,500 కోట్లు పంపించారని వ్యాఖ్యలు
ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి సీఎం రేవంత్ రెడ్డి రూ.2,500 కోట్లు పంపించారంటూ గతంలో కేటీఆర్ ఆరోపించారు. దీంతో ఓ కాంగ్రెస్ నాయకుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా.. హన్మకొండ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసి తదుపరిగా బంజారాహిల్స్ పోలీసులకు పంపారు. కేసు విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు ఇరు పక్షాల వాదనలు విన్న అనంతరం కేసును కొట్టివేసింది.