Site icon aksharatoday.in

Registration Department | ఫేక్​ ఎఫ్​ఎంసీతో రిజిస్ట్రేషన్లు.. సహకరిస్తున్న సబ్​ రిజిస్ట్రార్లు

Registration Department

Registration Department | ఫేక్​ ఎఫ్​ఎంసీతో రిజిస్ట్రేషన్లు.. సహకరిస్తున్న సబ్​ రిజిస్ట్రార్లు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Registration Department | అక్రమ రిజిస్ట్రేషన్లలకు (illegal registrations) అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ప్రయోజనం ఉండటం లేదు. ప్రత్యేకించి పలువురు సబ్​ రిజిస్ట్రార్లు అక్రమార్కులకు సహకారం అందిస్తుండటమే ఇందుకు కారణం. ముఖ్యంగా నకిలీ ఫ్యామిలీ మెంబర్​ సర్టిఫికెట్​ (fake family member certificates), డెత్​ సర్టిఫికెట్లతో కొందరు డాక్యుమెంట్లు సృష్టిస్తున్నారు. పక్కాగా పరిశీలన చేసి ఇలాంటి రిజిస్ట్రేషన్లకు చెక్​ పెట్టాల్సిన అధికారులే.. డబ్బులు తీసుకొని డాక్యుమెంట్లకు అనుమతించడంపై విమర్శలు వస్తున్నాయి.

నిజామాదాద్​ అర్బన్​ రిజిస్ట్రేషన్​ కార్యాలయం (Nizamabad Urban Registration Office) పరిధిలో తాజాగా నకిలీ ఎఫ్​ఎంసీ, డెత్ సర్టిఫికెట్లతో రిజిస్ట్రేషన్లు జరిపినా ఉదంతం వెలుగులోకి వచ్చింది. రెవెన్యూ అధికారుల సంతకాలను ఫోర్జరీ (Forgery signatures) చేసి ఫ్యామిలీ మెంబర్​ సర్టిఫికెట్లు సృష్టించి డాక్యుమెంట్లు తయారు చేశారు. కాగా.. సదరు సబ్​ రిజిస్ట్రార్​ పరిశీలన చేయకుండానే రిజిస్ట్రేషన్​ ప్రక్రియ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయమై ఓ బాధిత కుటుంబం తాజాగా అధికారులకు ఫిర్యాదు చేసింది.

Registration Department | ఈ రెండు ఉదాహరణలు

గత 15 రోజుల కిందట అర్సపల్లి శివారులో గల 300 గజాల స్థలానికి సంబంధించి ఓ రిజిస్ట్రేషన్ జరిగింది. కాగా సదరు డాక్యుమెంట్​లో సమర్పించిన ఎఫ్​ఎంసీ నకిలీది ఉన్నట్లు ఉన్నట్లు సమాచారం. ఖరీదైన స్థలాన్ని తమ పేరిట మార్చుకునేందుకు ఇలా దొడ్డిదారిలో నకిలీ ఎఫ్​ఎంసీని సమర్పించారని తెలుస్తోంది. అలాగే వర్ని రోడ్డులోని మరో 500 గజాల ప్రాపర్టీకి సంబంధించి నెల రోజుల కిందట రిజిస్ట్రేషన్ ప్రక్రియ (registration process) పూర్తయింది. ఈ దస్తావేజుకు ఏకంగా నకిలీ ఎఫ్​ఎంసీ, డెత్​ సర్టిఫికెట్​ (fake FMC and death certificate) జత చేసినట్లు సమాచారం. అయినప్పటికి ఇవేమీ లెక్క చేయకుండా సదరు సబ్​ రిజిస్ట్రార్​ రిజిస్ట్రేషన్​ ప్రక్రియ పూర్తి చేసి పెట్టడం కొసమెరుపు. ఇలాంటి రిజిస్ట్రేషన్లు ఎన్నో జరిగాయని తెలుస్తోంది.

Registration Department | నకిలీలను సృష్టిస్తుంది ఎవరు

సాధారణంగా ఫ్యామిలీ నంబర్​ సర్టిఫికెట్​ (family number certificate) తీసుకోవాలంటే ఓ ప్రక్రియ ఉంటుంది. ఇందుకోసం రెవెన్యూ శాఖ అధికారులు (revenue department officials) పరిశీలన జరిపి అన్ని పక్కాగా ఉంటేనే సర్టిఫికెట్​ జారీకి అనుమతి ఇస్తారు. ఈ క్రమంలో కొందరు దొడ్డిదారిలో సర్టిఫికెట్లు పొందేందుకు నకిలీలు తయారు చేసే ముఠాలను ఆశ్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో పలువురు డాక్యుమెంట్​ రైటర్లు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. గతంలోనే ఫ్యామిలీ మెంబర్​, డెత్​ సర్టిఫికెట్లు తీసుకున్నట్లు నకిలీవి సృష్టిస్తున్నారు. వీటి ద్వారా రిజిస్ట్రేషన్లు చేసుకుంటున్నారు. అయినా సబ్​ రిజిస్ట్రారర్లు ఇవేమి పట్టించుకోకుండా రిజిస్టరేషన్లు పూర్తి చేయడంపై పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version