అక్షరటుడే, నిజామాబాద్ సిటీ:CEIR Portal | నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్(Police Commissionerate) పరిధిలో సెల్‌ఫోన్లు పోగొట్టుకున్న 60 మందికి బాధితులకు తిరిగి అప్పగించారు. బాధితుల ఫోన్లను సీఈఐఆర్ పోర్టల్(CEIR Portal) ద్వారా రికవరీ చేసినట్లు సీఎస్‌బీ ఏఎస్పీ శ్రీనివాస్(CSB ASP Srinivas) తెలిపారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో పలువురు వివిధ సందర్భాల్లో సెల్‌ఫోన్లు పోగొట్టుకుని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారన్నారు. దీంతో ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించినట్లు పేర్కొన్నారు.
ఎవరైనా సెల్‌ఫోన్లు(Cell Phones) పోగొట్టుకుంటే సీఈఐఆర్ పోర్టల్(CEIR Portal) ద్వారా ఫోన్‌నంబర్‌ను www.ceir.gov.in వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలతో ఫిర్యాదు చేయాలన్నారు. దీంతో త్వరగా రికవరీకి అవకాశముంటుందన్నారు. ఈ మేరకు సెల్‌ఫోన్ల రికవరీ(Cell Phone Recovery)కి కృషిచేసిన కానిస్టేబుళ్లు అనుష, సుష్మను అభినందించారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది మస్తాన్ అలీ, ఐటీ కోర్, ఆర్‌ఎస్సై నిషిత్, సిబ్బంది ఉన్నారు.