అక్షరటుడే, వెబ్‌డెస్క్:Tenth Results | ఏపీలో పదో తరగతి ఫలితాలు(10th Results) విడుదల అయ్యాయి. ఈ ఫలితాల్లో ఓ విద్యార్థిని రికార్డు సృష్టించింది. ఎన్నడూ లేని విధంగా అన్ని సబ్జెక్టులలో వంద శాతం మార్కులు సాధించింది.
మొత్తం 600కు 600 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ ర్యాంకు(State First Rank) సాధించడమే కాకుండా.. అరుదైన ఘనత సాధించింది కాకినాడకు చెందిన విద్యార్థిని నేహాంజని. కాకినాడ భాష్యం స్కూల్(Kakinada Bhashyam School)లో పదో తరగతి చదివింది. 600 మార్కులు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా నేహాంజని(Nehanjani)పై ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, పాఠశాల యాజమాన్యం సంతోషంలో మునిగిపోయారు.