అక్షరటుడే, వెబ్‌డెస్క్: KTR | ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన సభలో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. రైతు సంక్షేమంపై తమ ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందన్నారు. కేసీఆర్ వస్తారా.. కేటీఆర్ వస్తారా అని ఆయన సవాల్ విసిరారు. తాజాగా దీనికి కేటీఆర్ స్పందించారు. శనివారం ఆయన తెలంగాణ భవన్(Telangana Bhavan)లో మాట్లాడారు. సీఎం సవాల్‌కు తాము సిద్ధమన్నారు. రేవంత్‌రెడ్డితో చర్చకు కేసీఆర్ అవసరం లేదని.. తానే వస్తానని స్పష్టం చేశారు.
KTR | ప్రిపేర్ అయి రావాలని ఎద్దేవా..
రైతు సంక్షేమంపై ఎక్కడికైనా చర్చకు తాము సిద్ధమని కేటీఆర్ ప్రకటించారు. ముఖ్యమంత్రికి 72 గంటల సమయం ఇస్తున్నట్లు చెప్పారు. ప్రిపేరై రావాలన్నారు. సీఎంకు బేసిక్ తెలియదని ఎద్దేవా చేశారు. నల్లమల పులిని అని చెప్పుకునే సీఎం.. నల్లమల ఎక్కడ ఉందని అధికారులను అడుగుతారని విమర్శించారు. రైతులకు ఎరువులు కూడా ఇవ్వడం చేతకావడం లేదని ప్రభుత్వంపై కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
KTR | 8న సోమాజిగూడ వస్తాం
సీఎం సవాల్ స్వీకరించిన తాము ఈ నెల 8న సోమాజిగూడ ప్రెస్‌క్లబ్ (Somajiguda Press Club)కు చర్చ కోసం వస్తామని కేటీఆర్ తెలిపారు. మంగళవారం ఉదయం 11 గంటలకు తాను ప్రెస్‌క్లబ్‌కు వస్తానని.. దమ్ముంటే సీఎం రావాలని సవాల్ విసిరారు. ప్రెస్‌క్లబ్‌లో సీఎం రేవంత్‌కు కుర్చీ వేసి పెడతామన్నారు. ముఖ్యమంత్రి ప్రిపేరై చర్చకు రావాలని, లేదంటే పరువు పోతుందని ఎద్దేవా చేశారు.