అక్షరటుడే, వెబ్‌డెస్క్: Deputy CM Bhatti | కృష్ణ, గోదావరి నీళ్లపై శాసనసభలో చర్చించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క (Deputy Chief Minister Bhatti Vikramarka) అన్నారు. దమ్ముంటే కేసీఆర్ చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు.
మహబూబ్ నగర్ జిల్లా (Mahabubnagar district) కేసముద్రంలో భట్టీ మంగళవారం పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదేళ్ల పాలనలో తెలంగాణను ఆగం చేసిన బీఆర్ఎస్ (BRS).. ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్‌తో మరోసారి ప్రజల్ని మోసం చేసేందుకు యత్నిస్తోందని ఆరోపించారు. ఈ నెల 12 నుంచి రాష్ట్రవ్యాప్తంగా డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాల పంపిణీని ప్రారంభిస్తామని చెప్పారు. వడ్డీ లేని రుణాలతో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దుతామన్నారు.
Deputy CM Bhatti | డిపాజిట్ కూడా రాదు..
పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ అన్ని రంగాలను నిర్వీర్యం చేసిందని భట్టి ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం ఏర్పాటైన రాష్ట్రంలో వాటిని పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్ పాలనలో (Congress rule) తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరుస్తుంటే బీఆర్ఎస్ అడ్డుకునేందుకు యత్నిస్తోందని విమర్శించారు. రైతుల సంక్షేమానికి పెద్దపీట వేసింది తామేనని చెప్పారు.
రూ.2 లక్షల రుణమాఫీ చేశామని, రైతుభరోసా ఇచ్చామన్నారు. ఒక్క సంవత్సరంలోనే రైతుల కోసం రూ.70 వేల కోట్లు ఖర్చు చేశామని వివరించారు. గత ప్రభుత్వం కన్నా రెండు వేల మెగావాట్లు అత్యధికంగా విద్యుత్ సరఫరా చేస్తున్నామని, రెప్పపాటు అంతరాయం లేకుండా రాష్ట్రవ్యాప్తంగా నాణ్యమైన విద్యుత్ సరఫరా జరుగుతుందన్నారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా తాము కష్టపడి పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. అయినా బీఆర్ ఎస్ తప్పుడు ఆరోపణలు చేస్తోందని, స్థానిక సంస్థల ఎన్నికల్లో వారికి డిపాజిట్ దక్కదన్నారు.
Deputy CM Bhatti | నీళ్లు ఆంధ్రకిచ్చింది నిజం కాదా?
నీటి వాటాలపై బీఆర్ఎస్ ఇప్పుడు నానా యాగి చేస్తోందని, పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో గుర్తు చేసుకోవాలని ఉప ముఖ్యమంత్రి (Deputy Chief Minister Bhatti Vikramarka) సూచించారు. ఆనాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో జలాల పంపిణీపై కేసీఆర్ చర్చలు జరపలేదా? అని ప్రశ్నించారు. రాష్ట్రం ఏమైనా పరవాలేదు.. కృష్ణ, గోదావరి నీళ్లు వాడుకోండని ఆంధ్రప్రదేశ్ కు వెళ్లి మరీ కేసీఆర్ ప్రకటించారా.. లేదా? అని నిలదీశారు. కృష్ణ, గోదావరి నీళ్లపై (Krishna and Godavari waters) శాసనసభలో చర్చించేందుకు రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉంది.. కేసీఆర్ చర్చకు రావాలని సవాల్ చేశారు. రూ.లక్ష కోట్లు ఖర్చుపెట్టి కాళేశ్వరం కట్టి పది ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదని విమర్శించారు. వాస్తవాలు బయటికి వస్తుంటే బీఆర్ఎస్ నేతలు అవాకులు, చవాకులు పేలుతున్నారన్నారు.