అక్షరటుడే, వెబ్‌డెస్క్ : RBI | రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI(Reserve bank of india) కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో మైనర్లు బ్యాంక్ అకౌంట్ Minor bank accounts తెరవాలంటే తల్లిదండ్రులు, సంరక్షకుల సమక్షంలోనే తెరవాల్సి ఉండేది. ప్రస్తుతం పదేళ్లు నిండిన మైనర్లు సొంతంగానే బ్యాంక్‌లో సేవింగ్స్ savings, రికరింగ్ recurring డిపాజిట్ ఖాతాలు తెరవచ్చొని ఆర్బీఐ స్పష్టం చేసింది.
గతంలో ఉన్న నిబంధనలు సరళతరం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. మైనర్లు ఎవరైనా సంరక్షకుల సమక్షంలో సులువుగా బ్యాంక్ అకౌంట్ minors bank account తీసుకోవచ్చని తెలిపింది. పదేళ్లు నిండిన వారు సొంతంగా కూడా అకౌంట్ తీసుకోవాలనుకుంటే ఇవ్వాలని బ్యాంకులను ఆదేశించింది.
పదేళ్లు నిండి సొంతంగా అకౌంట్ తీసుకున్న వారికి అకౌంట్బుక్తో పాటు, ఏటీఎం ATM, ఇంటర్నెట్ బ్యాంకింగ్ Internet Banking వంటి సౌకర్యాలు వారు అడిగితే కల్పించాలని ఆదేశించింది. అలాగే మైనర్ల అకౌంట్ బ్యాలెన్స్ నెగెటివ్‌లోకి వెళ్లకుండా చూడాలని పేర్కొంది. మైనర్ అకౌంట్ తీసుకున్న వారు 18 ఏళ్లు నిండితే వారి కేవైసీ kyc update పూర్తి చేసి కొత్తగా సంతకాలు తీసుకోవాలని ఆదేశించింది. అన్ని బ్యాంకులు ఈ రూల్స్‌ను పాటించాలని పేర్కొంది. ఈ నిబంధనలు జూలై 1 నుంచి అమలులోకి వస్తాయని, అప్పటిలోగా బ్యాంకులు తమ పాలసీలలో మార్పులు చేసుకోవాలని ఆర్బీఐ సూచించింది.