ePaper
More
    HomeసినిమాTollywood Ravi Teja | ర‌వితేజ ఇంట తీవ్ర విషాదం.. సంతాపం తెలిపిన ప్ర‌ముఖులు

    Tollywood Ravi Teja | ర‌వితేజ ఇంట తీవ్ర విషాదం.. సంతాపం తెలిపిన ప్ర‌ముఖులు

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Tollywood Ravi Teja : సినీ ఇండ‌స్ట్రీ (film industry) లో వ‌రుస‌గా విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. కోట శ్రీనివాస‌రావు (Kota Srinivasa Rao) మృతితో తీవ్ర దిగ్భ్రాంతి చెందిన సినీ ప్రియుల‌కు తెల్లారే మ‌రో షాక్ త‌గిలింది. అల‌నాటి అందాల న‌టి(beautiful actress) స‌రోజా దేవి (Saroja Devi) క‌న్నుమూశారు.

    ఈ రెండు మ‌ర‌ణాలు చాలా మందిని క‌లిచి వేశాయి. ఇక ఇప్పుడు ర‌వితేజ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. రవితేజ Ravi teja తండ్రి, ప్రముఖ ఫార్మాసిస్టు భూపతిరాజు రాజగోపాల్ రాజు మంగ‌ళ‌వారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారని కుటుంబ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. ఆయన కుమారుల్లో ర‌వితేజ స్టార్ హీరోగా ఎదిగారు.

    Tollywood Ravi Teja : ర‌వితేజ ఇంట్లో విషాదం..

    రాజ‌గోపాల్ రాజు త‌న‌యుల‌లో భరత్ రాజు Bharat Raj 2017 లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. మరొక కొడుకు రఘు కూడా ఇండ‌స్ట్రీలో న‌టుడిగా రాణిస్తున్నారు. అతని కుమారుడు మాధవ్ రాజ్ భూపతి త్వరలో హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టబోతున్నాడు. ర‌వితేజ తండ్రి వృత్తి రీత్యా ప‌లు ప్రాంతాల‌లో ఉద్యోగం చేయాల్సి రావ‌డంతో తాను అనేక ప్రాంతాలు తిరగాల్సి వ‌చ్చేద‌ని రవితేజ ఓ ఇంట‌ర్వ్యూలో తెలియ‌జేశారు.

    READ ALSO  Kota Srinivas Rao | ప్రముఖ నటుడు కోటా శ్రీనివాసరావు కన్నుమూత

    రాజ గోపాల్ రాజు స్వ‌గ్రామం ఆంధ్ర‌ప్ర‌దేశ్ లోని జ‌గ్గంపేట కాగా, ఉద్యోగ‌రీత్యా పలు ప్రాంతాల‌కి వెళుతూ ఉండేవారు. అనేక ప్రాంతాల‌కి ర‌వితేజ కూడా వెళుతూ ఉన్న‌నేప‌థ్యంలో ఆయ‌న ప‌లు యాస‌ల‌లో అవ‌లీల‌గా మాట్లాడ‌తాడు.

    ఇక రవితేజ సినిమాల విష‌యానికి వ‌స్తే కిశోర్‌ తిరుమల Kishore tirumala దర్శకత్వంలో ఇటీవలె ఓ చిత్రం ప్రారంభమైన సంగతి తెలిసిందే. ‘ఆర్‌టీ 76’ వర్కింగ్‌ టైటిల్‌తో ఈ చిత్రం రూపొందుతోంది. కామెడీ ప్ర‌ధానంగా చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు.

    Latest articles

    Local Body Elections | ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాల ఖరారు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Local Body Elections | స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసింది. రాష్ట్రంలో...

    Local Body Elections | స్థానిక పోరుపై కీలక అప్​డేట్​.. ఎన్నికలకు సిద్ధం కావాలని ఆదేశించిన ప్రభుత్వం

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Local Body Elections | రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు (local body elections) త్వరలో...

    TB Mukt Bharat Abhiyan | టీబీ ముక్త్ భారత్ అభియాన్​లో భాగస్వాములు కావాలి: గవర్నర్​

    అక్షరటుడే, ఇందూరు: TB Mukt Bharat Abhiyan | టీబీ ముక్త్ భారత్ అభియాన్​లో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని...

    ACB Trap | ఏసీబీకి చిక్కిన పంచాయతీరాజ్​ ఇంజినీర్​ ఇన్​ చీఫ్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్‌ : ACB Trap | రాష్ట్రంలో అవినీతి అధికారులు మారడం లేదు. సామాన్య ప్రజల నుంచి...

    More like this