అక్షరటుడే, వెబ్‌డెస్క్ : New Ration Cards | రేషన్ కార్డు పేదవాడి ఆత్మగౌరవం అని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరిలో కొత్త రేషన్‌కార్డుల (new ration card) పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉమ్మడి నల్లగొండ జిల్లాతో కాంగ్రెస్ పార్టీకి విడదీయరాని బంధం ఉందన్నారు. జిల్లా అభివృద్ధి అంతా కాంగ్రెస్ హయాంలోనే జరిగిందన్నారు. బీఆర్ఎస్ పార్టీకి 10 ఏళ్లు అవకాశం ఇస్తే గోదావరి నీళ్లు తుంగతుర్తికి ఎందుకు తేలేదని ప్రశ్నించారు.
New Ration Cards | మాజీ మంత్రిపై తీవ్ర విమర్శలు
సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డిపై (Suryapet MLA Jagadish Reddy) తీవ్ర విమర్శలు చేశారు. తుంగతుర్తికి గోదావరి నీళ్లు తీసుకురాని సీఎం రేవంత్‌రెడ్డిని అడ్డుకుంటామని ఆయన వ్యాఖ్యలు చేశారు. దీనిపై సీఎం స్పందిస్తూ మూడు అడుగుల నాయకుడు.. ఆరు అడుగుల ఎత్తు ఎగురుతున్నారని ఎద్దేవా చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో నీళ్లు ఎందుకు తేలేదని ప్రశ్నించారు. దొరగారి ముందు చేతులు కట్టుకొని గ్లాసులో సోడా పోయడమే ఆయనకు తెలుసన్నారు.
New Ration Cards | రేషన్ దుకాణాల్లో సన్నబియ్యం
పదేళ్లు అధికారంలో ఉన్నా బీఆర్ఎస్కు పేదలకు సన్నబియ్యం ఇవ్వాలనే ఆలోచన రాలేదని రేవంత్ రెడ్డి అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక రేషన్ లబ్ధిదారులకు ఉచితంగా సన్నబియ్యం అందిస్తున్నామని చెప్పారు. అంతేగాకుండా ఏళ్లుగా ఇవ్వకుండా ఆపిన రేషన్‌కార్డులను (ration cards) ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
New Ration Cards | రైతులకు బోనస్ ఇచ్చాం
రాష్ట్రంలో వ్యవసాయం దండగ కాదు.. పండుగ అని నిరూపించామని సీఎం అన్నారు. రైతులకు మద్దతు ధరతోపాటు బోనస్ ఇచ్చామన్నారు. అన్నదాతలకు రుణమాఫీ చేశామని, తొమ్మిది రోజుల్లో రూ.తొమ్మిది వేల కోట్లు రైతు భరోసా (Rythu Bharosa) జమ చేశామని ఆయన వివరించారు. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణ (Telangana) మొదటి స్థానంలో ఉందన్నారు.
New Ration Cards | పోరాటాల గడ్డ నల్గొండ
ఉమ్మడి నల్గొండ జిల్లా (Joint Nalgonda district) పోరాట యోధులను అందించిన గడ్డ అని సీఎం అన్నారు. పౌరుషాలు చూపించిన నాయకులు ఉన్న నేల అని కొనియాడారు. కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టులతోనే నల్గొండ జిల్లాకు నీళ్లు అందుతున్నాయన్నారు. బీఆర్ఎస్ (BRS Party) పదేళ్ల పాలనలో పేదలకు రేషన్ కార్డులు ఇచ్చిందా అని ప్రశ్నించారు.
కార్యక్రమంలో స్పీకర్ గడ్డం ప్రసాద్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.