అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ramayana Glimps | బాలీవుడ్‌లో మరో గ్రాండ్ మల్టీ స్టారర్ పౌరాణిక చిత్రం తెరకెక్కుతోంది. ‘దంగల్’ ఫేమ్ దర్శకుడు నితేశ్ తివారీ రూపొందిస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘రామాయణ’ నుంచి మేకర్స్ తాజాగా ఫస్ట్ గ్లింప్స్ విడుదల చేశారు. ఈ విజువల్స్‌తో దేశవ్యాప్తంగా ఈ చిత్రంపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. ఈ భారీ చిత్రంలో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor) శ్రీరాముడి పాత్రలో కనిపించనున్నాడు. సాయి పల్లవి (Sai pallavi) జగజ్జననీ సీతగా ఎంపిక కాగా, కన్నడ రాక్‌స్టార్ యష్ (Hero yash) అత్యంత శక్తిమంతమైన విలన్ రావణుడి పాత్రలో కనిపించబోతున్నాడు. సన్నీ డియోల్ (Sunny deol) హనుమంతుడిగా, లారా దత్తా కైకేయిగా, రవి దూబే లక్ష్మణుడిగా నటిస్తున్నారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్నారు.
Ramayana Glimps | విజువల్స్ అదుర్స్..
ఈ విజువల్ రెండు పార్టులుగా విడుదల కానుంది. మొదటి భాగం పూర్తిగా అయోధ్య నుంచి సీతాఅహరణం వరకు జరిగే సంఘటనలపై కేంద్రీకృతమై ఉంటుంది. రెండో భాగంలో రామాయణంలో ఉన్న యుద్ధ ఘట్టం, రాముడి విజయ గాథను చూపించనున్నారు. ఫస్ట్ గ్లింప్స్‌లో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల వాయిస్ ఓవర్‌తో ప్రారంభమవుతుంది. “ముల్లోకాలను త్రిమూర్తులు పరిపాలిస్తారు.. వారు సృష్టించిన ఈ లోకాలపై ఆధిపత్యం కోసం తామే ఎదురు తిరిగితే, ఓ మహాయుద్ధం మొదలవుతుంది..” అంటూ ప్రారంభమయ్యే ఈ వీడియోలో మానవజాతి చరిత్రలో అత్యంత పవిత్రమైన పురాణం ‘రామాయణం’ (Ramayana) మన చరిత్ర అని వినిపించే మాటలు గూస్ బంప్స్ (goosebumps) కలిగించేలా ఉన్నాయి.
ఈ గ్లింప్స్‌లో VFX, కాస్ట్యూమ్స్, స్టంట్స్, ఆర్ట్ డైరెక్షన్ ప్రతీ అంశంలో అత్యున్నత స్థాయిలో ఖర్చు చేసినట్టుగా కనిపిస్తోంది. బాలీవుడ్ నుంచి రానున్న అత్యంత భారీ విజువల్ ఎఫెక్ట్స్ (Heavy visual effects) చిత్రంగా ఇది నిలవనుంది. ఈ చిత్రం షూటింగ్ (Movie shooting) వేగంగా జరుగుతోంది. 2025లో సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. పాన్ ఇండియా (Pan India) స్థాయిలో తెలుగుతోపాటు అన్ని ప్రధాన భాషల్లో ఈ సినిమా రిలీజ్ కానుంది.