అక్షరటుడే, హైదరాబాద్: WWE Wrestling | కుస్తీ పోటీలకు WWE (వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్‌మెంట్) ఎంతో ప్రసిద్ధి చెందింది. ఈ టెలివిజన్ రియాలిటీ షోకు television reality show ప్రపంచవ్యాప్తంగా క్రేజీ ఉంది. ఇందులో పాల్గొనే రెజ్లర్లకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభిస్తుంది.
కాగా , WWE షోకు వెళ్లిన మొట్టమొదటి ఇండియన్ సెలబ్రిటీగా first Indian celebrity టాలీవుడ్ హీరో దగ్గుబాటి రానా Tollywood hero Daggubati Rana రికార్డు సృష్టించారు. అమెరికా లాస్‌వేగాస్‌లోని అలిజియంట్ మైదానంలో జరిగిన WWE మ్యాచ్‌లో రానా సందడి చేశారు.
WWE Wrestling | అనుభవాన్ని పంచుకున్న రానా
“41వ రెజిల్‌మేనియా మ్యాచ్‌ను WrestleMania match ప్రత్యక్షంగా చూడటం అద్భుతంగా ఉంది. WWE మన0 బాల్యంలో ఒక భాగం. ఇప్పుడు, దానిని ప్రత్యక్షంగా చూడటం, ప్రపంచ వేదికపై భారత్ కు ప్రాతినిధ్యం వహించగలగడం గొప్ప అనుభవం. ఇది ఒక ఫుల్-సర్కిల్ మూమెంట్. ” అని రానా తన అనుభవాన్ని పంచుకున్నారు. ఈ మేరకు రానా ఫొటోలను సోషల్ మీడియాలో నెట్‌ఫ్లిక్స్ షేర్ చేసింది.