అక్షరటుడే, కామారెడ్డి : SI Suspended | కామారెడ్డి Kamareddy జిల్లాలో విధుల్లో అలసత్వం వహించిన మరో ఎస్సై SIపై సస్పెన్షన్ వేటు పడింది. బాధితులకు సంబంధించిన కేసు నమోదుపై నిర్లక్ష్యం వహించిన రామారెడ్డి ramareddy si ఎస్సై నరేష్ nareshను సస్పెండ్ suspend చేస్తూ ఐజీ చంద్రశేఖర్ రెడ్డి IG Chandrashekar Reddy గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రామారెడ్డి మండలంలోని ఇసన్నపల్లి గ్రామానికి చెందిన ఓ ఫిర్యాదు విషయంలో నిర్లక్ష్యం చేయడమే కాకుండా.. ఫిర్యాదుధారులను ఎస్సై నరేశ్ పట్టించుకోలేదు.
ఎఫ్ఐఆర్ FIR నమోదు చేయడంలో ఆలస్యం చేశారు. కనీసం ప్రాథమిక విచారణ కూడా చేపట్టకపోవడం జిల్లా ఎస్పీ SP దృష్టికి వచ్చింది. దీంతో కేసును తీవ్రంగా పరిగణించిన ఎస్పీ విచారణను ముమ్మరం చేసి కేసును పరిష్కరించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఎస్సై నరేష్‌పై వెంటనే ఐజీకి నివేదిక పంపడంతో సస్పెండ్ చేస్తూ ఆయన ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసులు బాధ్యతాయుతంగా పనిచేయాలని, లేకపోతే చర్యలు తప్పవని ఎస్పీ రాజేశ్ చంద్ర kamareddy SP Rajesh Chandra హెచ్చరించారు.