అక్షరటుడే, వెబ్డెస్క్: Telangana Lokayukta | తెలంగాణ లోకాయుక్త lokayukta, ఉప లోకాయుక్త సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ శ్రీ జిష్ణుదేవ్ వర్మ Governer jishnudev varma లోకాయుక్తగా నియమితులైన జస్టిస్ ఎ.రాజశేఖర్ రెడ్డి(Lokayukta Rajasekhar Reddy), ఉప లోకాయుక్త జస్టిస్ బీఎస్ జగ్జీవన్ కుమార్(Deputy Lokayukta BS Jagjivan Kumar)తో ప్రమాణం చేయించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారిద్దరికి సీఎం శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో శాసనమండలి (Legislative Council) ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్(Speaker of Assembly) గడ్డం ప్రసాద్ కుమార్, ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, మహమ్మద్ అలీ షబ్బీర్, వేం నరేందర్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.