అక్షరటుడే, వెబ్డెస్క్ : Weather Updates | రాష్ట్రవ్యాప్తంగా గురువారం భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు (Meteorological Department Officers) తెలిపారు. గత కొన్ని రోజులు వరుణుడు ముఖం చాటేశాడు. దీంతో పంటలు సాగు చేసిన రైతులు (Farmers) ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో నేటి నుంచి భారీ వర్షాలు పడతాయని అధికారులు చెప్పారు.
దక్షిణ, మధ్య, పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో గురువారం మధ్యాహ్నం, సాయంత్రం భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉంది. హైదరాబాద్ నగరంలో చెదురుమదురు వానలు పడతాయి. రాత్రి, శుక్రవారం తెల్లవారుజామున సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయి. హైదరాబాద్ నగరంలో సైతం రాత్రి పూట భారీ వర్షం పడుతుంది. ఉత్తర తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం ప్రారంభమైంది.
Weather Updates | దంచికొట్టిన వాన
యాదాద్రి భువనగిరి జిల్లా, జనగామ, వరంగల్ రూరల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట జిల్లాల్లో బుధవారం అర్ధరాత్రి తర్వాత భారీ వర్షాలు కురిశాయి. సూర్యాపేట జిల్లా నాగారంలో 70మి.మీ, యాదాద్రిలోని రమ్మనపేటలో 51మి.మీ వర్షాపాతం నమోదైంది. వర్షంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.