అక్షరటుడే, వెబ్‌డెస్క్: Rain Forecast | బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడన ప్రభావంతో గత మూడు రోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు(Heavy Rains) కురిశాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలోని పలుచోట్ల వానలు దంచికొట్టాయి. దక్షిణ తెలంగాణ, హైదరాబాద్ నగరంలో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు మాత్రమే పడ్డాయి. అయితే గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు(Meteorological Department Officers) తెలిపారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. మిగతా ప్రాంతాల్లో తేలిక పాటి వానలు కురుస్తాయన్నారు.
Rain Forecast | భీమ్‌పూర్‌లో 90 మి.మీ వర్షపాతం
మహారాష్ట్ర(Maharashtra)లోని విదర్భలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాని ప్రభావంతో సరిహద్దులో ఉన్న ఆదిలాబాద్, ఆసిఫాబాద్‌లో కూడా బుధవారం కుండపోత వాన కురిసింది. భీమ్‌పూర్‌లో 90 మి.మీ వర్షపాతం నమోదు అయింది.
Rain Forecast | గోదావరికి వరద
మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్(Chhattisgarh)లో కురుస్తున్న వర్షాలతో దిగువన గోదావరికి వరద పోటెత్తింది. పెన్‌గంగా, వార్ధా, శబరి నదుల నుంచి భారీ వరద నీరు రావడంతో కాళేశ్వరం వద్ద గోదావరి నీటి మట్టం భారీగా పెరిగింది. గురువారం 6 లక్షల క్యూసెక్కుల వరకు వరద నీరు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఎగువన గోదావరి వరద లేక వెలవెలబోతోంది. ఎగువన గోదావరిపై శ్రీరామ్‌సాగర్(Sriram Sagar), ఎల్లంపల్లి ప్రాజెక్ట్ ఉన్నాయి. శ్రీరాంసాగర్ నిండితే వరద కాలువ ద్వారా మిడ్‌మానేరు, లోయర్ మానేరు డ్యాంలకు నీరు తరలించే అవకాశం ఉంది. అయితే ఎగువన వర్షాలు లేకపోవడంతో ప్రాజెక్ట్‌లు వెలవెలబోతున్నాయి.
Rain Forecast | తగ్గనున్న వర్షాలు
రాష్ట్రంలో రానున్న ఐదు రోజులు వర్షాలు తగ్గుముఖం పడతాయని అధికారులు తెలిపారు. ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయన్నారు. జులై 15–18 మధ్య ఉపరితల ఆవర్తన ధ్రోణి ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తాయి. జులై 19 నుంచి 28 వరకు వాతావారణం మేఘావృతమై ఉంటుంది. ముసురు పట్టినట్లు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.