అక్షరటుడే, వెబ్‌డెస్క్: Rain Alert | రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోమవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ (Meteorological Department) హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో పలు జిల్లాల్లో ఆదివారం వర్షం కురిసింది. రానున్న మూడు రోజులు అల్పపీడన ప్రభావం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Rain Alert | ఆ జిల్లాలకు అలర్ట్
ఉత్తర తెలంగాణ (North Telangana) జిల్లాలో సోమవారం అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరించారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జగిత్యాల, పెద్దపల్లి, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయని అధికారులు వివరించారు. దక్షిణ తెలంగాణలో చిరుజల్లులకు అవకాశం ఉందన్నారు. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంటుందని.. చలి గాలులు వీస్తాయని అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో సాయంత్రం, రాత్రి పూట తేలకపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
Rain Alert | ఉత్తరాదిలో భారీ వర్షాలు
ఉత్తర భారత దేశంలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వర్షాలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హిమాచల్ ప్రదేశ్‌లో వర్షాల కారణంగా ఇప్పటికే 60 మందికి పైగా మృతి చెందారు. అనేక ఇళ్లు కొట్టుకుపోయాయి. మరోవైపు మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో సైతం భారీ వర్షాలు కురుస్తున్నాయి.
Rain Alert | నాసిక్‌లో గోదావరి ఉధృతి
మహారాష్ట్రలో శనివారం, ఆదివారం వాన దంచి కొట్టింది. నాసిక్ జిల్లా భారీ వర్షాలతో గోదావరి నది ఉధృతంగా పారుతోంది. దీంతో రామకుండ్ ప్రాంతంలోని పలు ఆలయాలు నీట మునిగాయి.
Read all the Latest News on Aksharatoday.in