అక్షరటుడే, వెబ్డెస్క్:Weather | రాష్ట్రంలో ఒకవైపు ఎండలు మండుతున్నాయి. పలు జిల్లాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 45 డిగ్రీలకు చేరువలో ఉష్ణోగ్రతలు ఉండడంతో ప్రజలు వేడిమికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
కాగా.. ఈ సమయంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం(Meteorological Center) చల్లని కబురు చెప్పింది. తెలంగాణ రేపు పలుచోట్ల వర్షాలు rains alert today కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉమ్మడి వరంగల్ warangal, ఖమ్మం khammam, నల్గొండ nalgonda జిల్లాల్లో వానలు పడే అవకాశం ఉందని తెలిపింది. వర్ష సూచన నేపథ్యంలో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పలు చోట్ల కురిసిన అకాల వర్షాలకు చేతికొచ్చిన ధాన్యం తడిసి ముద్దయింది.